భారతీయులకు గుడ్‌న్యూస్.. UIDAI కొత్త ఆధార్ యాప్‌.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే!

దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి UIDAI శుభవార్త చెప్పింది. ఇక మీరు ఆధార్ కార్డును పర్సులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆధార్ కార్డును డిజిటల్‌గా మన ఫోన్‌లో ఉంచుకోవడానికి UIDAI కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. మనం ఆర్టీఐ వ్యాలెట్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎలా ఉంచుకుంటామో అదే విధంగా ఆధార్‌ను కూడా మనం డిజిటల్‌గా ఉంచుకోవచ్చు.. ఇంతకు ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పదండి.

భారతీయులకు గుడ్‌న్యూస్.. UIDAI కొత్త ఆధార్ యాప్‌.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే!
Aadhaar App

Updated on: Nov 10, 2025 | 12:10 PM

UIDAI ఎట్టకేలకు కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని UIDAI స్వయంగా తన X పోస్ట్‌ ద్వారా తెలియజేసింది. తాజాగా తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును తమ ఫోన్‌లో స్మార్ట్‌గా ఉంచుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా మీ ఆధార్ కార్డులను ఈజీగా ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు..అంతేకాకుండా ఈ యాప్‌ని ఉపయోగించి ముఖాన్ని స్కాన్ చేసి ప్రజలు తమ ఆధార్‌ను సులభంగా ధృవీకరించవచ్చు. UIDAI పోస్ట్ ప్రకారం, ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఇద్దరూ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఈ కొత్త యాప్ ప్రత్యేకలు

ఈ యాప్ సహాయంతో, మీరు మీ ఆధార్‌ను QR కోడ్ రూపంలో డిజిటల్‌గా షేర్ చేయవచ్చు. మీ IDని షేర్ చేసేప్పుడు కస్టమర్ మీరు అవతలి వ్యక్తికి మీ ఆధార్‌లోని ఎంత సమాచారం పంపాలో అంతవరకే ఎంచుకోవచ్చు.( ఉదాహరణకు మీరు వాళ్లకు మీ పేరు, ఆధార్ నెంబర్ మాత్రమే పంపాలనుకుంటే.. వాటని మాత్రమే సెలక్ట్‌ చేసుకోవచ్చే). ఒక వేళ మీరు మీ ఆధార్‌లోని నిర్దిష్ట డేటాను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదని భావిస్తే, ఏ వివరాలను పంచుకోవాలో, దేనిని ప్రైవేట్‌గా ఉంచాలో వాటిని మాత్రమే ఎంచుకోవచ్చు. ఈ యాప్ కస్టమర్‌కు వారి బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ యాప్‌ని ఉపయోగించి మీ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో కూడా తెలసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి చెందిన అందరి ఆధార్ కార్డులను ఈ ఒక్క యాప్‌లో ఉంచుకోవచ్చు.

ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి

  • ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఉపయోగించడం చాలా ఈజీ
  • మీరు మొదటగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఆధార్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • అవసరమైన అనుమతులను మంజూరు చేసి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • నిబంధనలు, షరతులను అంగీకరించండి
  • మీ ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నంబర్‌తో సైన్‌ఇన్ అవ్వండి. అంటే మీ ఆధార్‌కు లింక్‌ ఉన్న నెంబర్ మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్న ఫోన్‌లో ఉండాలి
  • ధృవీకరణ లేకుండా, మీరు యాప్ సెటప్‌ను పూర్తి చేయలేరు.
  • మీ ఫోన్ నంబర్ ధృవీకరించబడిన తర్వాత, ఫేస్ స్కాన్‌ను అడుగుతుంది.
  • ఆ తర్వాత, యాప్ కోసం సెక్యూరిటీ పిన్ సెట్ చేయమని అడుగుతుంది
  • ఇది పూర్తయిన తర్వాత, మీరు మీ ఆధార్ యాప్‌ను ఉపయోగించగలరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.