EPF Customers Alert: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. UANతో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!

|

Sep 25, 2021 | 6:18 PM

PF Customers: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు అందించింది ఢిల్లీ హైకోర్టు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..

EPF Customers Alert: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. UANతో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!
Follow us on

EPF Customers Alert: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు అందించింది ఢిల్లీ హైకోర్టు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ‌పీ‌ఎఫ్‌ఓ) ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క పీ‌ఎఫ్ ఖాతాదారుడు వారి పీ‌ఎఫ్ ఖాతాను (యూఏఎన్‌) ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పుడు ఆ గడువును నవంబర్‌ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి గతంలో జూన్ 1న ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉండగా, తర్వాత గడువుపు పొడిగించారు. అంటే పీఎఫ్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఆగస్టు 31లోగా ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయాల్సి ఉండేది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండేది. ఈపీఎఫ్‌వో జారీ చేసిన సర్క్యూలర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్‌ 15న కొత్త సర్క్యూలర్‌ను జారీ చేసింది. దీంతో పీఎఫ్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం సెప్టెంబర్‌ 1 గడువు ఇచ్చింది. తాజాగా ఢిల్లీ కోర్టు నవంబర్‌ 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కూడా ఈ గడువు పెంచింది కేంద్రం. కానీ ఈశాన్య సంస్థలు, ఇతర సంస్థలకు మాత్రమే గడువు ఉండేది. ఇప్పుడు తాజాగా అన్ని ప్రాంతాలకు గడువు పెరిగింది.

అయితే సామాజిక భద్రతాలో భాగంగా సెక్షన్‌ 142 ప్రకారం.. ఆధార్‌తో పీఎఫ్‌ ఖాతాను లింక్‌ చేయడం తప్పనిసరి. మీ ఆధార్‌ను యూఏఎన్‌ (యూనివర్సల్ అకౌంట్ నంబర్-UAN)తో లింక్‌ చేయకపోతే మీ కంపెనీ ఈపీఎఫ్‌ ఖాతాలో నెలవారీ పీఎఫ్‌ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే లింక్‌ పూర్తయ్యే వరకు మీరు రుణం లేదా పీఎఫ్‌ ఫండ్‌ నుంచి విత్‌డ్రా చేసుకోలేరు. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆధార్‌ అనుసంధానం గడువు పెంచింది పీఎఫ్‌ సంస్థ.

పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా

► ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.

► యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

► ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

► ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

► అందులో Aadhaar సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.

► ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

► ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.

► ఆ తర్వాత వివరాలు ఓసారి సరిచూసుకోవాలి.

► మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.

► అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

RBI Penalty: ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.79 లక్షల జరిమానా.. కారణం ఏమిటి..? కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది..!

Income Tax Return: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఆలస్యమైనా పెనాల్టీ ఉండదు.. ఎవరికి అంటే..?