Amazon Sale: ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహనాల సేల్.. అమెజాన్‌లో అద్బుత అవకాశం

|

Oct 26, 2024 | 5:16 PM

దేశంలో ఇ-కామర్స్ వెబ్ సైట్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాటిలో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలందరూ ఆసక్తి చూపుతున్నారు. వేలసంఖ్యలో వస్తువులు, భారీ డిస్కౌంట్లు, బ్యాంకు కార్డులపై ప్రత్యేక ఆఫర్లు, ఇంటికే డెలివరీలు తదితర అంశాలు దీనికి కారణమని చెప్పవచ్చు. ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా ప్రజల అభిమానాన్ని పొందుతూ వ్యాపారంలో దూసుకుపోతోంది.

Amazon Sale: ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహనాల సేల్.. అమెజాన్‌లో అద్బుత అవకాశం
Scooter Riding
Follow us on

ప్రస్తుతం దేశం మొత్త దీపావళి సందడి నెలకొంది. ఈ దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ప్ర త్యేక సేల్స్ నిర్వహిస్తూ విక్రయాలు జరుపుతోంది. ప్రస్తుతం ధనత్రయోదశితో పాటు దీపావళి పండుగ సందర్భంగా ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓలా, బజాజ్, వీడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు హీరో ఎక్స్ ట్రీమ్ బైక్ ను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేయడానికి అక్టోబర్ 29 వరకూ మాత్రమే అవకాశం ఉంది.

ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్

ఓలా ఎస్1 ప్రో లోని ఎలక్ట్రిక్ మోాటార్ 14 హెచ్ పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 195 కిలోమీటర్లు పరిగెడుతుంది. దీనిపై గంటకు 120 కిలోమీటర్ల గరిష్టం వేగంతో ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.1.44 లక్షలు (ఎక్స్ షోరూమ్). అలాగే ఓలా ఎస్ 1 ఎయిర్ లోని మోటారు 8 హెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తు 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్ షోరూమ్).

విడా వీ1

విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లస్, ప్రో అనే రెండు రకాల వేరియంట్లలో విడుదలైంది. వీటి ధర రూ.1.17 లక్షల నుంచి రూ.1.46 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ ఉంది. వీటికి ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటారు నుంచి 8 హెచ్ పీ శక్తి ఉత్పత్తి అవుతుంది. అయితే ప్లస్ వేరియంట్ కు 36.44, ప్రో వేరియంట్ కు 3.94 కేడబ్ల్యూహెచ్ ల బ్యాటరీ ప్యాక్ లు అమర్చారు. ప్లస్ 143 కిలోమీటర్లు, ప్రో 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వేరియంట్ల వారీగా 2903 ట్రిమ్ ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం టెక్ పాక్ కోసం రూ.1.58 లక్షలు వెచ్చించాలి. ఇక రేంజ్ విషయానికి వస్తే బ్లూ 2903, 2903 టెక్ పాక్ మోడళ్లు 123 కిలోమీటర్లు, బ్లూ 3202, 3202 టెక్ పాక్ మోడళ్లు 137 కిలోమీటర్లు, ప్రీమియం, ప్రీమియం టెక్ పాక్ మోడళ్లు 126 కిలోమీటర్లు ఇస్తాయి.

హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్

ప్రముఖ బ్రాండ్ హీరో విడుదల చేసిన ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ మోటారు సైకిల్ కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది. దీనిలోని 124.7 సీసీ ఇంజిన్ నుంచి 11.4 హెచ్ పీ, 10.5 ఎన్ ఎం టార్క్ విడుదలవుతుంది. ఈ మోటారు సైకిల్ రూ.97,666 నుంచి రూ.1.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి