Kabira Mobility : కబీరా మొబిలిటీ సంస్థ రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లను KM3000 మరియు KM4000 ఎలక్ట్రిక్ బైక్‌లను 2021 ఫిబ్రవరి 15న ఇండియాలో విడుదల చేయనుంది. దీని కోసం ప్రీ-బుకింగ్‌లను తాజాగా కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్ – www.kabiramobility.com లో ప్రారంభించారు. వీటి ఫీచర్ల విషయానికొస్తే, ఈ మోడల్స్ కాంబి బ్రేకింగ్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పార్క్ అసిస్ట్‌తో వస్తాయి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు రోడ్‌సైడ్ అసిస్టెంట్‌ను అందించనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. KM3000 మరియు KM4000 అనే రెండు బైక్‌లలో డెల్టా ఇవి BLDC హబ్ ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. వీటి సహాయంతో ఇవి 120కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ బైక్‌లు ఒకే పూర్తి ఛార్జీతో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.
గోవా కేంద్రంగా ఉన్న కబీరా మొబిలిటీ ప్రస్తుతం గోవా తోపాటు ధార్వాడ్‌లో రెండు ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. అంతేకాకుండా, భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ధార్వాడ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కేంద్రం ఏప్రిల్ 2021 నాటికి పనిచేస్తుంది. అలాగే ఇక్కడ నెలకు 75,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. KM3000 పూర్తిగా ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఉంటుంది. KM4000 మోడల్ స్ట్రీట్ ఫైటర్‌లా కనిపిస్తుంది.
స్మార్ట్రాన్ ఇండియా నుండి సరికొత్త ఈ-బైక్.. త్వరలోనే మార్కెట్‌లోకి ‘టీబైక్ వన్ ప్రొ’..