ప్రతి ఒక్కరికి రూ.1.77 లక్షలు ఇస్తా..! డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన.. అసలు విషయం ఇదే!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాన్ని గట్టిగా సమర్థించారు. అవి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నాయని, దేశాన్ని మరింత సంపన్నం చేశాయని పేర్కొన్నారు. సుంకాల వల్ల వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చి, ప్రతి అమెరికన్‌కు 2000 డాలర్ల డివిడెండ్ అందించవచ్చని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరికి రూ.1.77 లక్షలు ఇస్తా..! డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన.. అసలు విషయం ఇదే!
Donald Trump

Updated on: Nov 10, 2025 | 6:15 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలపై తన వైఖరిని గట్టిగా సమర్థించుకున్నారు. అవి అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు. నవంబర్ 9వ తేదీ ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ సుంకాలను వ్యతిరేకించే వారిని మూర్ఖులని ట్రంప్ పిలిచారు. అతని ప్రకారం సుంకాలు అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేశాయి, దేశాన్ని గతంలో కంటే మరింత సంపన్నంగా మార్చాయని అన్నారు.

తన విధానాల వల్ల అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా నిలిచిందని ట్రంప్ పేర్కొన్నారు. తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన స్టాక్ మార్కెట్, పెరుగుతున్న పెట్టుబడులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే మెరుగైన స్థితిలో ఉందని ఆయన రాశారు. 401k ఖాతాలుగా పిలువబడే అమెరికన్ల పదవీ విరమణ ఖాతాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని కూడా ట్రంప్ అన్నారు.

సుంకాల ద్వారా వచ్చే ఆదాయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ట్రిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అదనపు ఆదాయంతో దేశం త్వరలో దాదాపు 37 ట్రిలియన్‌ డాలర్ల భారీ రుణాన్ని తగ్గించడం ప్రారంభించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే సుంకాల ద్వారా వచ్చే ఆదాయం గురించిన వాదనలను స్పష్టమైన డేటాతో ఇంకా నిరూపించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రతి అమెరికన్‌కు 2000 డాలర్లు..!

తన పోస్ట్‌లో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కొత్త కర్మాగారాలు, ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఈ టారిఫ్ విధానాలు భవిష్యత్తులో ప్రతి అమెరికన్‌కు కనీసం 2,000 డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 1,77,000ల పైనే) డివిడెండ్‌ను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి