Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే!

Indian Railways: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఈ మార్గంలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రైళ్లను రద్దు చేయడానికి కారణం ఏంటనేది రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది..

Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే!
Indian Railways

Updated on: Jan 27, 2026 | 7:15 AM

Indian Railways: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లోని మందమర్రి-బెల్లంపల్లి మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా అనేక రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేట రైల్వే జంక్షన్ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రయాణిస్తారు. ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే కీలకమైన రైల్వే జంక్షన్. 1929లో కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ పూర్తయిన తర్వాత, చెన్నై నుండి ఢిల్లీకి ప్రత్యక్ష కనెక్షన్ ఏర్పడింది.

కాజీపేట రైల్వే జంక్షన్ సికింద్రాబాద్ లైన్ 1874లో హైదరాబాద్ నిజాం ఆర్థిక సహాయంతో నిర్మించారు. ఆ తర్వాత ఇది గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలో భాగమైంది. ఇక్కడి నుండి ఢిల్లీ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రదేశాలకు ప్రతిరోజూ అనేక రైళ్లు నడుస్తాయి. వేలాది మంది ప్రయాణికులు ఈ జంక్షన్ ద్వారా తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తారు. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతుంది. చాలా మంది ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగిస్తారు. దేశంలోని వివిధ తీర్థయాత్రలను సందర్శించడానికి టూర్ ప్యాకేజీలను కూడా తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

కాజీపేట-సిర్పూర్ టౌన్ (17003) ఎక్స్‌ప్రెస్, బల్లార్ష-కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్ష-కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్, మరియు కాజీపేట-బల్లార్ష (17035) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భద్రాచలం రోడ్-బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ (17034) సింగరేణి ప్యాసింజర్ పాక్షికంగా రద్దు చేశారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Auto News: ఈ బైక్‌ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి