
సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖంగా రోజూ కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వీటి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టామాటా ధరలు కుల్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం టామాటా ధరలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలకగా.. గత వారం రూ.25కి పడిపోయాయి. ఇప్పుడు రూ.10 తగ్గి రూ.15కే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరాగాయల ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
మంగళవారం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు మార్కెట్లో కేజీ టామాటా రూ.17గా ఉంది. దొండకాయ రూ.45, చిక్కుడుకాయ రూ.23, గోరుచిక్కుడు రూ.35గా ఉంది. ఇక బీట్ రూట్ కేజీ రూ.15, క్యాప్చికం రూ.43, బెండకాయ రూ.35, వంకాయ రూ.23, పచ్చిమిర్చి రూ.45, బజ్జిమిర్చి రూ.35, ఎండుమిర్చి రూ.220గా ఉంది. దోసకాయ కేజీ రూ.19, కీర దోస రూ.18, సొరకాయ రూ.20, ఆలుగడ్డ రూ.17, కాకరకాయ రూ.45, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.15, బీన్స్ రూ.45, క్యారెట్ రూ. 25, బీన్స్ రూ.45గా ఉన్నాయి. ఉల్లిగడ్డ కేజీ రూ.20, చామగడ్డ రూ.28. కంద రూ.35, పొట్లకాయ రూ.18గా ఉంది.
ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో టామాట కేజీ రూ.22, బెండ రూ.20, వంగ రూ.25, పచ్చిమిర్చి రూ.37, కాకక రూ.30, క్యారెట్ రూ.32గా ఉంది. ఇక క్యాబేజ్ రూ.23, బీరకాయ రూ.38, దొండకాయ రూ.49, బంగాళదుంప రూ. 25, ఉల్లిపాయలు రూ.25, దోస రూ.40, పొట్టకాయ రూ.20, చామ రూ.23గా ఉంది. బీట్‌రూట్ రూ.25, కీర రూ.30, క్యాప్చికం రూ.55గా ఉంది. గోంగూరు, తోటకూర, చుక్కకూర రూ.10గా ఉంది. మెంతికూర రూ.5, కొత్తిమీర రూ.20గా ఉంది.
ఇక విజయవాడ రైతు మార్కెట్లో కేజీ టామాటా రూ.19, వంగ రూ.25, బెండ రూ.24, పచ్చిమిర్చి రూ.32, కాకర రూ.40, క్యాబేజీ రూ.22, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.24, గోరుచిక్కుడు రూ.32, దోస రూ.40, సొరకాయ రూ.10, బీరకాయ రూ.24, చామదుంప రూ.26, కీరదోస రూ.30గా ఉంది.