Today Petrol, Diesel Price: పెరుగుతుండటంతో సామాన్యుడిపై అధిక భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడో ఒకసారి తగ్గించినా.. పెరగడం మాత్రం రోజూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా.. ధరలు పెరగడం మాత్రం ఆగడం లేదు.
ఇక ఫిబ్రవరి 5న దేశ వ్యాప్తంగా లీటర్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.86.65గా ఉంది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.
హైదరాబాద్‌లో లీటర్ ధర రూ.90.42, డీజిల్ రూ.84.14కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.93.42, డీజిల్ రూ.83.99గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ.89.54 ఉండగా, డీజిల్ రూ.81.44గా ఉంది. అలాగే కోల్‌కతాలో పెట్రోల్ రూ.89.54, డీజిల్ రూ.80.44 ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాహనం లేనివారుండరు. వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ఇతర అవసరాల నిమిత్తం వాహనాలను ప్రతి రోజు నడపాల్సిందే. చమురు ధర ఎంత పెరిగినా.. పెట్రోల్, డీజిల్ పోయాల్సిందే.