Petrol Price Today: మూడు నెలల క్రితం ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్‌లు పడ్డాయి. వాహనదారుకుల ఊరటిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చెక్ పెట్టింది. దీంతో గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించడంలేదు. ఇదిలా ఉంటే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. మంగళవారం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 కాగా, డీజిల్ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 109.98 గా ఉండగా, డీజిల్ రూ. 94.14 గా నమోదైంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ. 101.40, డీజిల్ రూ. 91.43 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 100.58 గా ఉండగా, డీజిల్ రూ.85.01 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లోనూ ఇంధన ధరల్లో మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 108.20 వద్ద ఉండగా, డీజిల్ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.
* తెలంగాణలో ప్రముఖ పట్టణమైన వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107.69 కాగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
* విజయవాడలో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ. 110.69 , డీజిల్ రూ. 96.75 వద్ద కొనసాగుతున్నాయి.
* సాగరతీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 109.96 గా ఉండగా, డీజిల్ రూ. 95.18 వద్ద కొనసాగుతోంది.
Liver Health Care: లివర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..
Kajal Aggarwal: మరోసారి బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన కాజల్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో..