Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!

Gold Price Today: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్‌న్యూస్‌. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు..తాజాగా తగ్గుముఖం పట్టింది...

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!
Gold

Updated on: Oct 20, 2021 | 5:58 AM

Gold Price Today: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్‌న్యూస్‌. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టింది. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుధవారం (అక్టోబర్‌ 20)న దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అయిఏ నిలకడగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పెరిగింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. 10 గ్రాముల ధరపై రూ.560 వరకు తగ్గింది. ఇక హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,330 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Indian Companies: భారత్‌లో ఈ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే షాకవుతారు..!

Electricity Bills: మీరు కరెంటు బిల్లు చెల్లించాలా..? ఈ యాప్స్‌ ద్వారా సులభంగా కట్టొచ్చు.. ఎలాగంటే..!

Loading...
Unable to load recommendations.
Follow Us