బ్రేకింగ్: మళ్లీ వెయ్యి తగ్గిన బంగారం..!

| Edited By:

Sep 16, 2019 | 11:42 AM

బంగారం ధరలు మళ్లీ.. దిగొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.37,200లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్స్ ఆభరణాల 10 గ్రాముల బంగారం ధర రూ.35,200లుగా ఉంది. ఈ లెక్కన 24 క్యారెట్స్ ఒక గ్రాము రూ.3,720లు కాగా.. 22 క్యారెట్స్ ఒక గ్రాము రూ.3,200గా ఉంది. అలాగే.. కిలో వెండి రూ.48,800లుగా మార్కెట్లో పలుకుతోంది. గత 10 రోజులుగా.. పసిడి ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం […]

బ్రేకింగ్: మళ్లీ వెయ్యి తగ్గిన బంగారం..!
Follow us on

బంగారం ధరలు మళ్లీ.. దిగొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.37,200లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్స్ ఆభరణాల 10 గ్రాముల బంగారం ధర రూ.35,200లుగా ఉంది. ఈ లెక్కన 24 క్యారెట్స్ ఒక గ్రాము రూ.3,720లు కాగా.. 22 క్యారెట్స్ ఒక గ్రాము రూ.3,200గా ఉంది. అలాగే.. కిలో వెండి రూ.48,800లుగా మార్కెట్లో పలుకుతోంది. గత 10 రోజులుగా.. పసిడి ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌టైం హై రికార్డుగా 40వేల బెంజ్ మార్క్‌ దాటిన బంగారం.. సడన్‌గా తగ్గుతూ వస్తోంది. మార్కెట్లో రూపాయి విలువ బాగా బలపడుతుండటంతో.. ఇలా పసిడి ధరలు తగ్గుతున్నాయి. అలాగే.. ఇది పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడంతో.. డిమాండ్ లేక ధరలు ఇలా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా చమురు ధరలు (పెట్రోలు, డీజిల్) పెరుగుతోన్నాయి.