రోజురోజుకీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతోన్నాయి. తాజాగా మళ్లీ ఈ రోజు.. ఒక వెయ్యి ఒక్కసారిగా పెరిగింది. దీంతో.. వినియోగదారుల్లో బంగారంపై ఆశ సన్నగిల్లుతోంది. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న పసిడి.. మళ్లీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వెయ్యి పెరుగుదలతో రూ.39,490గా ఉంది. పది గ్రాముల 22 ఆభరణాల బంగారం ధర రూ.37,500లుగా ఉంది. కాగా.. వెండి కిలో రూ.2 వేల పెరుగుదలతో 47,265గా ఉంది.
సాధారణంగా ఆషాఢమాసం, శ్రావణమాసాల్లో బంగారం తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నదానికి విరుద్ధంగా పసిడి ధర పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. బంగారం ధర మరో నెలలో దాదాపు రూ.50 వేలకు పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.