TikTok: షార్ట్ వీడియో యాప్ అయిన టిక్‌టాక్ మరో రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ రికార్డు సొంతం చేసుకుంది. అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంగా నిలిచిన ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టేసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే భారత్ లాంటి దేశాల్లో నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలవడం గమనార్హం. త్వరలో భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డౌన్‌లోడ్‌లో టిక్‌టాక్ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్‌లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి. ఒకవేళ టిక్‌టాక్ భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే టిక్‌టాక్ యాప్ డౌన్‌లోడ్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ ఏషియా పేర్కొంది