
బడ్జెట్ అనేది దేశ ప్రగతికి చాలా కీలకంగా మారుతుంది. ప్రతి ప్రభుత్వం ఏటా ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. దానిలో ఆ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి డెవలప్ మెంట్ జరుగుతుంది? ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించారనే విషయం తెలుస్తుంది. 2024 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి 31వతేదీ మధ్య కాలానికి ఈ బడ్జెట్ ను తయారు చేస్తారు. దీనిలో కల్పించే రాయితీలు, మినహాయింపులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో మన దేశంలో బడ్జెట్‌ను ఏటా సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. చాలా కాలం పాటు ఆ సంప్రదాయం కొనసాగించింది. అనంతరం ఉదయం ప్రవేశ పెట్టడం ప్రారంభించారు. దీని పెద్ద కారణమే ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
మన దేశం చాలాకాలం బ్రిటిష్ పరిపాలనలో ఉండడం వల్ల వారికి అనుకూలంగా ఉండేలా అనేక విధానాలు రూపొందించారు. దానిలో భాగంగానే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం కూడా నిర్ణయించారు. సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే పద్దతి వెనుక కూడా కారణమదే. ఎందుకంటే భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ).. బ్రిటీష్ ప్రామాణిక సమయం (బీఎస్‌టీ) కంటే 4.5 గంటలు ముందుంటుంది. అలాగే గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) కంటే 5.5 గంటలు ముందు ఉంటుంది. ఆ ప్రకారం దేశంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం వల్ల ఇంగ్లాండ్‌లో పగటిపూట జరుగుతుంది. అంటే వారి దేశంలో ఉదయం 11.30 గంటలకు లేదా మధ్యాహ్నం 12:30 గంటకు పెట్టినట్టు భావించేవారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఆ సంప్రదాయమే కొనసాగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలో 1999లో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 5 గంటల సంప్రదాయం ముగిసింది. సిన్హా 1998 నుంచి 2002 వరకు దేశ ఆర్థిక మంత్రిగా సేవలించారు. బడ్జెట్ వివరాలను పార్లమెంటులో చర్చిండానికి ఎక్కువ సమయం ఉంటుందని, సంఖ్యలను విశ్లేషించడానికి అవకాశం ఉంటుందని ఈ మార్పును తీసుకువచ్చినట్టు ఆయన వివరించారు. నేటికీ ఆయన తీసుకువచ్చిన పద్ధతిలోనే, ఉదయం 11 గంటలకే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
దేశం ఏటా ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే, 2017లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో ఈ పద్ధతిని మార్పు చేశారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్పులు చేశారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో విలీనం చేశారు. అదే సంవత్సరం వీటిని ప్రత్యేకంగా సమర్పించారు. దీంతో 92 ఏళ్ల పాత సంప్రదాయానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కారణంగా జూలై 23న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..