Savings Tips : పొదుపులో ఇదో మంత్రం.. ఆ నిధితో అత్యవసర సమయాల్లో రక్షణ

|

Mar 25, 2023 | 4:00 PM

నిపుణులు మాత్రం ప్రతి వ్యక్తికి ఆర్థిక క్రమ శిక్షణ మాత్రం చాలా అవసరం అని చెబుతూ ఉంటారు. సంపాదించిన ప్రతి రూపాయిలో కొంచెం అయినా పొదుపు చేయాలని సూచిస్తూ ఉంటారు.

Savings Tips : పొదుపులో ఇదో మంత్రం.. ఆ నిధితో అత్యవసర సమయాల్లో రక్షణ
Business Idea
Follow us on

జీవితం అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో? తెలియదు. ముందుగా ఏ ఖర్చు ఎప్పుడు కొంప ముంచుతుందో? తెలియక చాలా మంది మదనపడుతుంటారు. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో అప్పులు తీసుకుని వడ్డీలు కట్టలేక సతమతమవుతుంటారు. అయితే నిపుణులు మాత్రం ప్రతి వ్యక్తికి ఆర్థిక క్రమ శిక్షణ మాత్రం చాలా అవసరం అని చెబుతూ ఉంటారు. సంపాదించిన ప్రతి రూపాయిలో కొంచెం అయినా పొదుపు చేయాలని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి కుటుంబ వారి అవసరాలకు అత్యవసర నిధి అనుకుని కొంత సొమ్మును వివిధ పెట్టుబడి సాధనాల్లో దాచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులు సూచించే అత్యవసర నిధి అంటే ఏంటి? పొదుపు చేసిన సొమ్మును ఎందులో పెట్టుబడి పెట్టాలో? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

అత్యవసర నిధి అంటే ఏంటి?

నెలవారీ ఆదాయం నుంచి స్థిరమైన డిపాజిట్ల సహాయంతో ఎమర్జెన్సీ ఫండ్ ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే దాన్ని అత్యవసర నిధి అని అనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ బ్యాంక్ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వారానికో, పక్షంవారీ లేదా నెలవారీ ప్రాతిపదికన సొమ్మును పొదుపు చేయవచ్చు. పెద్ద, ఊహించని వాటి కోసం మీరు చెల్లించాల్సిన కష్ట సమయాల్లో ప్రయాణించడం ఫండ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఆకస్మికంగా  ఆసుపత్రిలో చేరడం, ప్రమాదం,  ఇంటి మరమ్మతులు వంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిధి మనకు చాలా ఉపయోగపడుతుంది. 

అత్యవసర నిధిని నిర్మించడం ఇలా

అత్యవసర నిధిని నిర్మించడానికి మొదటి దశలో మీ నెలవారీ ఖర్చులను మ్యాప్ చేయాలి. అత్యవసర నిధిని సృష్టించడానికి దాన్ని 3 లేదా 6తో గుణించడం ఉత్తమం. ఇది చెల్లించడానికి తగినంత పెద్దదిగా ఉండాలి. అలాగే ఈ ఫండ్ ఉద్దేశ్యం లాభం పొందడం కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఊహించని పరిస్థితులలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ఇది మీకు భద్రతను సృష్టించే మార్గమని గమనించాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఇది లిక్విడ్ అసెట్ కాబట్టి తక్షణమే ఉపసంహరించుకునే అవకాశాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో డబ్బును వెంటనే ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ అత్యవసర నిధి మీకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

అత్యవసర నిధి పొదుపు, పెట్టుబడి సాధనాలు

అత్యవసర నిధి మీకు ఎలాంటి సమయంలోనైన అనవసరమైన అప్పులు పాలు కాకుండా మిమ్మల్ని వడ్డీ భారం నుంచి కూడా గట్టెక్కిస్తుంది. అలాగే మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అత్యవసర నిధి కింద పొదుపు చేయాలనుకునే డబ్బును పొదుపు ఖాతాల్లో లేదా స్వల్పకాలిక ఎఫ్‌డీల్లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి