Income tax: ఇలా అయితే నష్టమే! పన్ను చెల్లింపుదారులు సరిచేసుకోవాలి..

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ఫారం 26 ఏఎస్ అనేది చాలా ముఖ్యమైంది. ఆదాయపు పన్ను శాఖకు వారు చెల్లించిన టీడీఎస్ (మూలం వద్ద మినహాయించిన) పన్ను వివరాలను అది తెలియజేస్తుంది. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీరు చెల్లించిన టీడీఎస్ పన్నులను క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే ఫారం 26 ఏఎస్ లోని వివరాలకు మీరు ఐటీఆర్ లో నమోదు చేసిన టీడీఎస్ వివరాలు సరిపోవాలి.

Income tax: ఇలా అయితే నష్టమే! పన్ను చెల్లింపుదారులు సరిచేసుకోవాలి..
Tax Rules

Updated on: Jun 12, 2024 | 2:14 PM

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ఫారం 26 ఏఎస్ అనేది చాలా ముఖ్యమైంది. ఆదాయపు పన్ను శాఖకు వారు చెల్లించిన టీడీఎస్ (మూలం వద్ద మినహాయించిన) పన్ను వివరాలను అది తెలియజేస్తుంది. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీరు చెల్లించిన టీడీఎస్ పన్నులను క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే ఫారం 26 ఏఎస్ లోని వివరాలకు మీరు ఐటీఆర్ లో నమోదు చేసిన టీడీఎస్ వివరాలు సరిపోవాలి.

టీడీఎస్ అంటే..

ట్యాక్స్ డిటెక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) అంటే మూలం వద్ద మినహాయించిన పన్ను అని అర్థం. ఒక వ్యక్తికి ఆదాయం వచ్చిన సమయంలో దాని నుంచి పన్నును వసూలు చేసే పద్ధతి. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి పన్ను రాబడిని సక్రమంగా వచ్చేలా చూడడం, అలాగే పన్ను ఎగవేతలను అరికట్టడం. అంటే మీకు వచ్చే అద్దె, వడ్డీ, జీతం, కమీషన్ తదితర వాటిపై ముందుగానే పన్నును మినహాయిస్తారు. ఇలా వసూలు చేసిన టీడీఎస్ ఆదాయపు పన్ను ఖాతాకు జమ అవుతుంది. అతడు ఐటీఆర్‌ను దాఖలు చేసినప్పుడు చివరి పన్ను బాధ్యతను క్లెయిమ్ చేయవచ్చు.

ఫారం 26 ఏఎస్..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం ఫారం 26 ఏఎస్ ను జారీ చేస్తారు. మీకు వచ్చిన ఆదాయం, దానికి విధించిన టీడీఎస్ వివరాలు దీనిలో ఉంటాయి. ట్యాక్స్ క్రెడిట్ స్టేట్ మెంట్ గా పిలిచే దీనిని ప్రతి ఏటా పన్ను చెల్లింపుదారులు పొందవచ్చు. అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం నుంచి తీసివేసిన టీడీఎస్ వివరాలు దీనిలో ఉంటాయి. టీడీఎస్ మినహాయించిన వ్యక్తి పేరు, అతడి ఖాతా, అతడి ఆదాయం, ప్రభుత్వానికి పన్ను జమచేసిన తేదీ తదితర అన్ని వివరాలూ పొందుపరుస్తారు. ఫారం 26 ఏఎస్ లోని టీడీఎస్ సమాచారంతో మీ టీడీఎస్ సర్టిఫికెట్లను సరిచూసుకోవాలి. రెండింటిలో వివరాలు సక్రమంగా పర్వాలేదు. లేకపోతే ఇబ్బంది కలుగుతుంది.

వివరాలుంటేనే..

సాధారణంగా మూలం వద్ద పన్ను మినహాయించిన వారు తప్పనిసరిగా దాని వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. వాటిలో పన్ను మినహాయించిన వ్యక్తి పేరు, అతడి పాన్ నంబర్, మినహాయించబడిన పన్ను మొత్తం, తేదీ తదితర వివరాలు ఉండాలి. అలా డిడక్టర్ అందించిన టీడీఎస్ సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ డిడక్టీ ఫారం 26 ఏఎస్ ను సవరిస్తుంది

రెండింటి మధ్య తేడా వస్తే..

ఫారం 26 ఏఎస్ లో చూపించిన టీడీఎస్ వివరాలకు మీ టీడీఎస్ క్రెడిట్ కు మధ్య కొన్ని సార్లు తేడాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం నుంచి మినహాయించిన టీడీఎస్ వివరాలను డిడక్టర్ సక్రమంగా ఆదాయపు పన్ను శాఖకు తెలియచేయకపోవచ్చు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పన్ను ఆదాయంపై ప్రయోజనం పొందుతారు.

వ్యత్సాసం ఉంటే..

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన సమాచారం ప్రకారం పన్నుచెల్లింపుదారులు కింద జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డిడక్టర్‌ను సంప్రదించాలి. మీ సమస్యను తెలిపి, టీడీఎస్ వ్యత్యాసాన్ని సరిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరాలి.

తప్పులను సరి చేసుకోవాలంటే..

పన్నును మినహాయించే వ్యక్తి అందించిన వివరాల ఆధారం గానే ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ వివరాలను ఫారం 26 ఏఎస్ లో అప్‌డేట్ చేస్తుంది. అందువల్ల టీడీఎస్ వివరాలను అందించడంలో డిడక్టర్‌ ఏదైనా తప్పు చేస్తే ఈ సమస్య ఏర్పడుతుంది. మీ టీడీఎస్ వివరాలు ఫారం 26 ఏఎస్ లో కనిపించవు. ఇలాంటి ఇబ్బందులను సరిదిద్దుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది. డిడక్టర్ కారణంగా వ్యత్యాసం ఏర్పడినట్లయితే టీడీఎస్ లేదా టీసీఎస్ దిద్దుబాటు స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..