Telugu News Business These banks offer the highest interest on FDs, a feast for senior citizens, Fixed deposits details in telugu
Fixed deposits: ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు పండగే..!
వివిధ బ్యాంకులు అమలు చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలకు ప్రజల ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుంది. కాలానుగుణంగా ఎన్ని పెట్టుబడి మార్గాలు వచ్చినప్పటికీ వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిర్ణీత కాలానికి అసలుతో కలిపి వడ్డీ పొందడం, మార్కెట్ రిస్కులతో సంబంధం లేకుండా రాబడి రావడంతో వీటిలో డబ్బులను ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను వీటిలోనే పెట్టుబడి పెడతారు. సాధారణ ఖాతాదారులతో పోల్చితే వీరికి బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం వరకూ వడ్డీని అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన రెపోరేటును 25 బేసి పాయింట్లకు తగ్గించింది. అంటే 6.50 శాతం నుంచి 6.25 శాతానికి కుదించింది. దీని వల్ల రుణ గ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఎఫ్‌డీలలో పెట్టుబడిదారులకు వడ్డీ తగ్గిపోతుంది. రిజర్వ్ బ్యాంకు నిర్ణయం మేరకు బ్యాంకులు త్వరలో తమ ఎఫ్ డీలపై వడ్డీని తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలలో డబ్బులు పెట్టడం మంచింది. దీనివల్ల ప్రస్తుతం అమలవుతున్న రేట్లను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎఫ్ డీలపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
యూనియన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 1001 రోజుల డిపాజిట్‌కు 9.5 శాతం వడ్డీని లభిస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకూ డిపాజిట్లకు 9.1 శాతం వడ్డీ అమలవుతోంది.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఐదేళ్ల డిపాజిట్లపై 9.1 వడ్డీ ఇస్తున్నారు.
ఈక్విటాస్ బ్యాంకులో 888 రోజులకు 9 శాతం వడ్డీ అమలవుతుంది.
ఈఎస్‌ఏఎఫ్ బ్యాంకులో (888 రోజులు) 8.88 శాతం, జన ఫైనాన్స్ లో (ఏడాది నుంచి మూడేళ్లు ) 8.75 శాతం, ఉజ్జీవన్ బ్యాంకులో (12 నెలలు) 8.75 శాతం ఇస్తున్నారు.
ప్రైవేటు రంగ బ్యాంకులు
బంధన బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడాదికి 8.55 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.
డీసీసీ బ్యాంకులో 8.55 శాతం వడ్డీని ఇస్తున్నారు.
ఎస్‌బీఎం బ్యాంకులో 18 నెలల నుంచి రెండేళ్ల కంటే తక్కువ రోజులకు ఎఫ్‌డీలపై 8.75 వడ్డీని ఇస్తున్నారు.
సౌత్ ఇండియన్ బ్యాంకులో 18 నెలల డిపాజిట్లపై 7.90 శాతం వడ్డీ ఇస్తున్నారు.
కర్నాటక బ్యాంకులో 375 రోజులకు 8 శాతం వడ్డీ పొందవచ్చు.
ప్రభుత్వ బ్యాంకులు
బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులలో ఎఫ్ డీ లపై 7.80 శాతం వడ్డీని పొందవచ్చు.
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 7.95 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.
పంజాబ్, సింధ్ బ్యాంకులలో 7.95 శాతం వడ్డీని పొందవచ్చు.