
దేశంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అనేక కొత్త కార్లు మార్కెట్ లో విడుదలవుతున్నాయి. వివిధ కంపెనీలు పోటాపోటీగా నూతన ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది అనేక కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మహీంద్రా, టాటా, హ్యుందాయ్, మారుతీ సుజుకి తన నూతన కార్లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న పది కార్ల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి.
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ఈ కారును ప్రదర్శించారు. 1.5లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. తర్వాత 1.2లీటర్ల టర్బో పెట్రోల్, టీజీడీఐ ఇంజిన్ తో విడుదల చేస్తారు. ఈ కారు పొడవుగా, లోపలి భాగం విశాలంగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కార్లకు పోటీగా మార్కెట్ లో ఉంటుందని భావిస్తున్నారు.
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇది బెస్ట్ కారు. మహీంద్రా త్వరలో దీని రిఫ్రెష్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ 1.2లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లు, 1.5లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీతో పాటు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఉంది.
అత్యుత్తమ టెక్నాలజీ, సరికొత్త ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లతో ఈ కారు ఆకర్షణీయంగా ఉంది. అధునాతన బ్యాటరీ సెటప్ ఏర్పాటు చేశారు. దీనిని ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో దీనికి ప్రత్యేక స్థానం లభిస్తుందని భావిస్తున్నారు.
6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఈ కారులో ఏర్పాటు చేశారు. స్పోర్టియర్ వీల్స్, స్ట్రిప్స్, వెనుకవైపు స్పాయిలర్, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. కాంట్రాస్టింగ్ రెడ్ ప్యానెళ్లు, స్టిచింగ్‌తో లోపల నలుపు రంగులో ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న థార్ కంటే కొంచె విశాలంగా ఉంటుంది. థార్ లో ఉన్నట్టే
2.0లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన 2.2లీటర్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. మెరుగైన ట్యూనింగ్, పవర్ ఫికర్‌లను కలిగి ఉంటుందని చెబుతున్నారు.
ఈ కారు 1.5లీటర్ల టర్బో పెట్రోల్ లేదా 1.5లీటర్ల డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది ప్రత్యేక మైన 7 సీటర్ ఎస్ యూవీ. త్వరలో అప్ డేటెడ్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదలవుతుంది.
టాటా హారియర్ ఎస్ యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా దీనిని రూపొందించారు. డిజైన్ పరంగా చాలా వరకూ హారియర్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కావడం వల్ల కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు.
మహీంద్ర సంస్థ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెర్షన్ ఇది. కొంచె భిన్నమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది చివరికి ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ ఇంగ్లో ఆర్కిటెక్చర్ తో రూపొందించారు.
ఈ కారు త్వరలో విడుదల కానుంది. ఇది ఈ కంపెనీ రూపొందించిన అతి పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్. ఒక్కసారి చార్జింగ్ తో 614 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డీసీ ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ..
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మహీంద్ర విడుదల చేయనున్న మోడల్ ఇది. టాటా నిక్సాన్.ఈవీ కారుకు ఇది పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ మోడల్ గురించి అదనపు వివరాలు అందుబాటులో లేవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..