Telugu News Business These are the tour packages offered by IRCTC at low cost, Check details in telugu
IRCTC: తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆనందం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్ సీటీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుని తక్కువ ఖర్చుతో మీకు నచ్చిన ప్రదేశాలను ఆనందంగా సందర్శించవచ్చు. ఐఆర్ సీటీసీలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అందుబాటులో ఉన్న టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.
వివిధ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి పరిస్థితులు, ప్రజల జీవన విధానం, చారిత్రక కట్టడాలు, ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకోవాలని చాలా అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో, ఆయా ప్రాంతాలలో ఎలా తిరిగాలో తెలియక వెనుకంజ వేస్తారు. అలాంటి వారికి టూర్ ప్యాకేజీలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ విధానంలో ఎక్కువమందిని టూర్ కు తీసుకువెళ్లి, అన్ని ప్రదేశాలను చూపిస్తారు. అనేక మందితో కలిసి ఉండడం వల్ల పర్యటనను ఆస్వాదించవచ్చు. వివిధ వ్యక్తులతో కలిసి ఉండడం వల్ల కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అయితే దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చుతాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్ సీటీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుని తక్కువ ఖర్చుతో మీకు నచ్చిన ప్రదేశాలను ఆనందంగా సందర్శించవచ్చు. ఐఆర్ సీటీసీలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అందుబాటులో ఉన్న టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.
తక్కువ బడ్జెట్..
ఐఆర్ సీటీసీ టూర్ ప్యాకేజీల ద్వారా రైళ్లలో వివిధ ప్రదేశాలను సందర్శించవచ్చు. తక్కువ బడ్జెట్ తో అనేక ప్రాంతాలలో పర్యటించవచ్చు. ప్రయాణ ఏర్పాట్లన్నీ ముందుగానే తయారు చేయబడినందున సమయం ఆదా అవుతుంది. హోటళ్లు, వివిధ ప్రదేశాల పూర్తి సమాచారం ముందుగానే ఇవ్వబడుతుంది. అలాగే టూర్ ప్యాకేజీతో ప్రయాణం చేస్తే మీకు మంచి ఆఫర్లు కూడా లభిస్తాయి. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ ఉన్న టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్‌లో..
లక్నో నుంచి సిమ్లాకుఫ్రీ టూర్ ప్యాకేజీ – సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది.
చండీగఢ్ నుంచి గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ టూర్ ప్యాకేజీ (సెప్టెంబర్ 7)