
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ఏర్పాటు చేసిన పథకం. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) నిర్వహిస్తుంది. ఈ పథకంలో చేరిన చందాదారుల జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తం మినహాయిస్తారు. ఆ ఉద్యోగి విరమణ అనంతరం పెద్ద మొత్తంలో అందజేస్తారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించడానికి ఇది ఉపయోగపడుతుంది.
పీఎఫ్ ఖాతాలో చందాదారుడి వివరాలన్నీ నమోదు చేస్తారు. అవి సక్రమంగా ఉంటేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అయితే ఒక్కోసారి పేరు, ఇతర వివరాలలో తప్పులు దొర్లుతాయి. వాటిని సరిచేసుకోవడం చాలా అవసరం. గతంలో ఇలాంటి మార్పులు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. చందాదారులు తమ యజమాని సంతకం చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫాం సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పని చాలా సులభమైంది. కేవలం ఆన్ లైన్ లో చాలా ఈజీగా మార్పులు చేసుకోవచ్చు.
ఇలాంటి మార్పుల కోసం ఈపీఎఫ్ఓ ఒక సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను విడుదల చేసింది. దీనిద్వారా మన పీఎఫ్ ఖాతాలో సుమారు 11 రకాల మార్పులను ఆన్ లైన్ లో చాలా సులభం చేసుకోవచ్చు. సభ్యుడి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి / తల్లి పేరు, రిలేషన్, వైవాహిక స్థితి, చేరిన తేదీ, ఉద్యోగం మానివేయడానికి కారణం, మానివేసిన తేదీ, జాతీయత, ఆధార్ కార్డు తదితర వాటిలో మార్పులు సాధ్యమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..