Money Tips: వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్య తరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం..

|

Aug 09, 2024 | 6:04 PM

ఎవరైనా సక్సెస్ అయిన వ్యక్తి చెప్పే సూచనలకు అధిక విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికే విజయతీరాలకు చేరిపోయారు కాబట్టి. అలాంటి ఒక బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఈయన ఒకరు. బెర్క్‌షైర్ హాత్వే సంస్థ సీఈఓ. ఈయన జీవన శైలి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈయన చెప్పే జీవిత సత్యాలు, బిజినెస్ సూత్రాలు కూడా విజయ తీరాలకు బాటలు వేస్తాయి.

Money Tips: వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్య తరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం..
Warren Buffet
Follow us on

లక్షాధికారులు కావాలను ఎవరిక మాత్రం ఉండదు. అందరూ డబ్బు సంపాదించాలని కష్టపడతారు. అయితే కొన్ని ఎదురు దెబ్బలు తగిలే సరికి ఇక నా కర్మ ఇంతే.. నా బతుకు ఇంతే అని నిరుత్సాహ పడిపోతుంటారు. అయితే ఓడిపోవడమే విజయానికి తొలి మెట్టు అని చాలా మంది నిపుణులు సైతం చెబుతుంటారు. ఈ క్రమంలో ఆదాయాన్ని సంపాదించడానికి చిట్కాలు సైతం నిపుణులు ఇస్తారు. అయితే ఎవరైనా సక్సెస్ అయిన వ్యక్తి చెప్పే సూచనలకు అధిక విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికే విజయతీరాలకు చేరిపోయారు కాబట్టి. అలాంటి ఒక బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఈయన ఒకరు. బెర్క్‌షైర్ హాత్వే సంస్థ సీఈఓ. ఈయన జీవన శైలి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈయన చెప్పే జీవిత సత్యాలు, బిజినెస్ సూత్రాలు కూడా విజయ తీరాలకు బాటలు వేస్తాయి. అటువంటి వారెన్ బఫెట్ ఇటీవల మధ్యతరగతి వారికి డబ్బు సంపాదనకు ఉపయోగపడే కొన్ని సూత్రాలు చెప్పారు. వాటి ద్వారా సంపన్నులుగా మారొచ్చని చెబుతున్నారు. మరి వారెన్ బఫెట్ చెప్పిన ఐదు సూత్రాల గురించి తెలుసుకుందామా..

మీకోసం మీరు పొదుపు చేయండి..

పే యువర్ సెల్ఫ్.. అని సిఫార్సు చేసిన మొదటి వ్యక్తి వారెన్ బఫెట్. దీని అర్థం ఏమిటంటే.. నెలవారీ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి అనే విషయాన్సి స్పష్టం చేస్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం.. ప్రతి నెలలో ఖర్చులు పోనూ మిగిలినది సేవింగ్స్ కోసం పక్కన పెడతాం. కానీ వారెన్ బఫెట్ అది తప్పంటున్నారు. సేవింగ్స్ పక్కన పెట్టిన తర్వాత మిగిలిన దానిలో ఖర్చులు సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల అధికంగా సేవింగ్స్ లో జమవుతాయని వివరిస్తున్నారు.

అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి..

అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు కీలకమైనదని వారెన్ బఫెట్ చెబుతున్నారు. మనకు ఏవి అనవసరమైనవి అని ఎలా తెలుసుకోవాలి? అంటే మీకు మీరుగా కఠినమైన బడ్జెట్‌తో జీవించమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోవాలి. మీరు జీవితంలో ఏ ఖర్చులకు ప్రాధాన్యతనిస్తారు? మీకు నిజంగా అవసరం లేని అదనపు ఖర్చులు ఏవి? అనేది నిర్ధారించుకోవాలి. ఇది అధిక పొదుపునకు కారణమవుతుంది. కాలక్రమేణా, కొద్ది మొత్తంలో పొదుపు కూడా పెద్ద మొత్తంలో సమకూరుతుంది.

రుణాలను నివారించండి..

మీరు సరిగ్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని.. మీరు సంపాదించిన దాని కంటే తక్కువ ఖర్చు చేస్తే.. రుణాల అవసరం రాదు. మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకుంటే ఇది తప్పనిసరిగా పాటించాలి. క్రెడిట్ కార్డులు ఉన్నా.. నగదు చెల్లించేందుకే మొగ్గుచూపాలి అని సూచిస్తున్నారు. బఫెట్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. తనకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్డు ఉన్నా.. 98శాతం ఖర్చులు నగదు రూపంలోనే చేసేవారట. బఫ్ఫెట్ సంపన్నుడిగా ఉండటానికి సహాయపడిన సాధనాల్లో నగదును ఉపయోగించడం ఒకటైతే, అది మన మధ్యతరగతి వారికి కూడా సరిపోతుంది.

మీ కోసం పెట్టుబడి పెట్టండి..

ప్రతి వ్యక్తి తన సంపాదన నుంచి కొంత మొత్తాన్ని తన కోసం పొదుపు చేయాలని చెబుతున్నారు. కనీసం 10శాతం వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అధిక ధనాన్ని సంపాదించేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.

నిరుత్సాహంగా జీవించకండి..

పొదుపు చేయమన్నాం కదా అని మీరు మరీ పొదుపుగా జీవిస్తే, మీ జీవితమంతా దుర్భరమవుతుంది, అప్పుడు ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే ప్రస్తుత అవసరాలను గమనంలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించుకోవడం ముఖ్యం. స్వల్పకాలిక లక్ష్యాల కంటే దీర్ఘకాలిక లాభాలపై దృష్టి కేంద్రీకరించడాన్ని బఫ్ఫెట్ నొక్కి చెబుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..