FASTAG: మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

|

Oct 05, 2024 | 3:08 PM

సాధారణంగా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను యూపీఐ పేమెంట్స్‌ ద్వారా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందులో ఆటో పేమెంట్‌ రూల్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ రూల్సలో మార్పులు చేర్పులు చేశారు. 24 గంటల ముందు వినియోగదారులకు పంపే నోటిఫికేషన్‌లు ఇకపై మీకు పంపరు. మాన్యువల్‌గా ప్రమేయం లేకుండా తమ ఫాస్టాగ్ ఖాతాలను...

FASTAG: మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Fastag
Follow us on

వాహనం ఉన్న ప్రతీ ఒక్కరూ ఫాస్టాగ్‌ను ఉపయోగించడం సర్వసాధారణమైన విషయం. ఒకప్పటిలా హైవేపై టోల్‌గేట్స్‌ వద్ద వాహనాలు ఆగాల్సిన పనిలేకుండా, నేరుగా అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వ ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో సమయంతో పాటు శ్రమ కూడా తగ్గింది. అయితే ఈ ఫాస్టాగ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంటారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్‌డేటను తీసుకొచ్చారు అధికారులు.

సాధారణంగా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను యూపీఐ పేమెంట్స్‌ ద్వారా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందులో ఆటో పేమెంట్‌ రూల్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ రూల్సలో మార్పులు చేర్పులు చేశారు. 24 గంటల ముందు వినియోగదారులకు పంపే నోటిఫికేషన్‌లు ఇకపై మీకు పంపరు. మాన్యువల్‌గా ప్రమేయం లేకుండా తమ ఫాస్టాగ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా రీఛార్జ్ చేసుకునేందుకు ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చారు.

ఆటో పే ఫీచర్‌లో భాగంగా బ్యాలెన్స్‌ అవసరమైన అమౌంట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ డెబిటింగ్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇంతకు ముందు ఆటో పేమెంట్ ఆప్షన్ యాక్టివేట్ అయినప్పుడు యూజర్లు పేమెంట్ చేయడానికి 24 గంటల ముందు నోటిఫికేషన్ అందుకొనే వారు. ఈ నోటిఫికేషన్ రిమైండర్‌గా కూడా పనిచేసేది. అవసరమైతే పేమెంట్ అడ్జెస్ట్ చేయడానికి లేదా రద్దు చేయడానికి వినియోగదారులకు అవకాశం ఇస్తుంది. ఫాస్టాగ్‌ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో అవసరమైన లిమిట్ కంటే తక్కువకు చేరితే, ఇకపై ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్‌ లేకుండానే డబ్బు ఆటోమేటిక్‌గా డిబెట్ అవుతాయి. అయితే ఈ ఆటో పే ఫీచర్‌ని ఇష్టం ఉన్నప్పుడు ఎనేబుల్ లేదా డిజేబుల్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఒకవేళ మీరు ఆటో-పే చెల్లించకూడదనుకుంటే.. మీరు దానిని మాన్యువల్‌గా తీసివేయవచ్చు. ఇందుకోసం ముందుగా యూపీఐ యాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి చెల్లింపును నిర్వహించు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత AUTO PAY UPI అనే ఆప్షన్‌ను ఎంచుకొని.. ఆఫ్‌ లేదా ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..