FD Rates: ఎఫ్‌డీలపై బ్యాంకుల కన్నా అధిక వడ్డీ.. మీ డబ్బుకు ప్రభుత్వ భరోసా కూడా..

|

Sep 01, 2024 | 5:23 PM

పోస్టాఫీస్ లలో అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ సీ) పథకం చాలా బాగుంటుంది. ఇది ఐదేళ్ల వ్యవధితో కూడిన డిపాజిట్ పథకం. ప్రస్తుతం దీని ద్వారా 7.7 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నారు. పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్ సీ తదితర బ్యాంకులు ఐదేళ్ల ఎఫ్ డీలకు అందించే వడ్డీ కంటే ఎక్కువ. ఉదాహరణకు..

FD Rates: ఎఫ్‌డీలపై బ్యాంకుల కన్నా అధిక వడ్డీ.. మీ డబ్బుకు ప్రభుత్వ భరోసా కూడా..
Fd Offer
Follow us on

మన దగ్గర ఉన్న సొమ్మును వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని పొందటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేని సురక్షిత పద్ధతులలో డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. పెట్టుబడితో పాటు వడ్డీని తిరిగి వచ్చే సురక్షిత మార్గాల కోసం చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఎన్ఎన్‌సీ, పోస్టాఫీసు, వివిధ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. అయితే ఆయా పథకాలకు అమలు చేస్తున్న వడ్డీరేట్లను బాగా పరిశీలించాలి. మీకు ఒక నిర్ధిష్ట మొత్తంలో రాబడి కావాలనుకుంటే కనీసం రూ.5 లక్షలను సుమారు ఐదేళ్ల కాల వ్యవధికి డిపాజిట్ చేయాలి. ఈ మొత్తానికి వివిధ డిపాజిట్ల పథకాల ద్వారా వచ్చే వడ్డీరేటు, మెచ్యూరిటీ అనంతరం అందే మొత్తం సొమ్ము గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీసు పథకం (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)..

పోస్టాఫీస్ లలో అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ సీ) పథకం చాలా బాగుంటుంది. ఇది ఐదేళ్ల వ్యవధితో కూడిన డిపాజిట్ పథకం. ప్రస్తుతం దీని ద్వారా 7.7 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నారు. పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్ సీ తదితర బ్యాంకులు ఐదేళ్ల ఎఫ్ డీలకు అందించే వడ్డీ కంటే ఎక్కువ. ఉదాహరణకు మీరు ఎన్ఎస్ సీలో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి. దానిపై ఇచ్చే 7.7 శాతం వడ్డీ ప్రకారం మీరు రూ.. 2,32,124 రాబడి పొందుతారు. అంటే ఐదేళ్ల తర్వాత అసలుతో కలిపి రూ.7,32,124 అవుతుంది. కాగా.. ఎన్ఎస్ సీ ఖాతాను కేవలం రూ.వెయ్యి పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..

ఎస్బీఐలో ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.5 శాతం,సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం ఎస్బీఐలో రూ.5 లక్షలు ఎఫ్ డీ చేస్తే 6.5 శాతం వడ్డీరేటు ప్రకారం సాధారణ ప్రజలకు రూ.1,90,210 రాబడి వస్తుంది. అసలుతో కలిసి ఆ మొత్తం 6,90,210 అవుతుంది. ఇక సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ ప్రకారం ఐదేళ్లకు రూ. 2,24,974 రాబడి వస్తుంది. అసలుతో కలిసి రూ.7,24,974కి పెరుగుతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)..

ఈ బ్యాంకులో ఐదేళ్ల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 6.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ.ఐదు లక్షలను డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత రూ.1,90,210 వడ్డీతో కలిసి మొత్తం 6,90,210 చేతికి వస్తుంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 7.3 వడ్డీరేటు అమలవుతోంది. దీని ప్రకారం వారు ఐదేళ్ల తర్వాత రూ. 2,17,891 వడ్డీతో కలిసి, రూ. రూ.7,17,891 తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రైవేటు బ్యాంకులు..

ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్ డీఎఫ్ సీ లో ఐదేళ్ల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.50 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ రేట్లను అమలు చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ లో సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీని ఇస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..