Bank Loans: గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా? లేకపోతే ఏమవుతుంది?

విద్యా అవసరాలకు విద్యా రుణాలు, గృహాలకు కట్టుకునేందుకు, నిర్మించుకునేందుకు హోమ్‌ లోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ లోన్ల కోసం పలు ప్రైవేటు బ్యాంకులతో పాటు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు అందిస్తాయి. కొంతమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులను సైతం ఆశ్రయిస్తారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం బ్యాంకుల్లోనే లోన్లు తీసుకోడానికి మొగ్గుచూపుతున్నారు.

Bank Loans: గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా? లేకపోతే ఏమవుతుంది?
Loans

Edited By:

Updated on: Dec 06, 2023 | 10:10 PM

అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరతలు తీర్చడానికి పర్సనల్‌ లోన్లతో పాటు గోల్డ్‌ లోన్లు బాగా ఉపయోగపడతాయి. పర్సనల్‌ లోన్లకు ఎటువంటి పత్రాలు అవసరం లేకపోయినా దానిలో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో గోల్డ్‌ లోన్లు తక్కువ వడ్డీ రేటుతో వస్తాయి. అలాగే విద్యా అవసరాలకు విద్యా రుణాలు, గృహాలకు కట్టుకునేందుకు, నిర్మించుకునేందుకు హోమ్‌ లోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ లోన్ల కోసం పలు ప్రైవేటు బ్యాంకులతో పాటు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు అందిస్తాయి. కొంతమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులను సైతం ఆశ్రయిస్తారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం బ్యాంకుల్లోనే లోన్లు తీసుకోడానికి మొగ్గుచూపుతున్నారు. తక్కువ వడ్డీతోపాటు భద్రత ఉంటుందని భావిస్తారు. అయితే ఈ రుణాలపై చాలా మందిలో కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా తొలిసారి బ్యాంకులో లోన్‌ తీసుకునే వారికి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటివి ఎక్కువగా నెట్‌లో సెర్చ్‌ చేసిన ప్రశ్నలకు నిపుణుల సాయంతో సమాధానాలు అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

బంగారం కొనుగోలు చేసిన రశీదులు కావాలా?

గోల్డ్‌ లోన్‌ బ్యాంకులో తీసుకునే సమయంలో సాధారణంగా అందరికీ వచ్చే సందేహం ఇదే. చాలా ఏళ్ల క్రితం బంగారం కొనుగోలు చేసి ఉంటాం. అప్పటి రశీదు ఉండటం కష్టం. అందుకే బ్యాంకులు బంగారు కొనుగోలు చేసిన రశీదు అడగవు. కానీ బంగారం నాణ్యతను మాత్రం తనిఖీ చేస్తాయి. దాని స్వచ్ఛతకు ప్రధాన్యం ఇస్తాయి. అలాగే లోన్‌ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

విద్యా రుణం ప్రీ పేమెంట్‌ చేయొచ్చా?

చాలా మందికి ఉన్నత విద్యకు విద్యారుణాలు దోహదపడుతున్నాయి. అయితే వాటిని తిరిగి ఈఎంఐలు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే మన దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉన్నప్పుడు దానిని ప్రీ క్లోజర్‌ చేసే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. దీనిలో సాధారణంగా, ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు కానీ ఏవైనా ప్రతికూల నిబంధనల కోసం బ్యాంకు అగ్రిమెంట్ లెటర్‌ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు నేరుగా బ్యాంక్‌లో విచారించవచ్చు. లోన్ క్లోజ్ అయిన తర్వాత, మీరు లోన్ క్లోజ్డ్ కన్ఫర్మేషన్ లెటర్, ఏదైనా సెక్యూరిటీ రిలీజ్ పొందుతారు. అనంతరం బ్యాంక్ నుంచి నో-డ్యూస్ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

గృహ రుణంతో పాటు జీవిత బీమా తప్పనిసరా?

ఇటీవల కాలంలో గృహ రుణాలతో జీవిత బీమా కూడా కొన్ని బ్యాంకులు తప్పనిసరి చేశాయి. అయితే ఇప్పటికే టర్మ్‌ కవర్‌ ఉన్న వారు తిరిగి బీమా తీసుకోవాలా అంటే అవసరం లేదనే చెప్పాలి. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఇల్లు కోల్పోతో ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇంటి కవర్‌ తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..