Top 1.5 Ton ACs: మార్కెట్లో బెస్ట్ 1.5 టన్ ఏసీలు.. కేవలం రూ.30 వేల కన్నా తక్కువ ధరకే..

ఎక్కువ శాతం మంది ఈఎంఐ పెట్టి అయినా సరే ఎయిర్ కండీషనర్(ఏసీ) కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మీరు అలాంటి ఆలోచనల్లోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. కేవలం రూ.30 వేల లోపు ధరలోనే లభ్యమయ్యే ఐదు టాప్ మోడళ్ల 1.5 టన్ విండో ఏసీలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి అధిక పనితీరు మీకు వేసవి తాపాన్ని తెలియనీయవంటే అతిశయోక్తి కాదు.

Top 1.5 Ton ACs: మార్కెట్లో బెస్ట్ 1.5 టన్ ఏసీలు.. కేవలం రూ.30 వేల కన్నా తక్కువ ధరకే..
Best Window Acs

Updated on: Mar 07, 2024 | 6:26 AM

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కబోత మొదలైంది. ఈ ఏడాది భానుడు విశ్వరూపం చూపిస్తాడని, ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అందరూ ఏసీలు, కూలర్ల వైపు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఈఎంఐ పెట్టి అయినా సరే ఎయిర్ కండీషనర్(ఏసీ) కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మీరు అలాంటి ఆలోచనల్లోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. కేవలం రూ.30 వేల లోపు ధరలోనే లభ్యమయ్యే ఐదు టాప్ మోడళ్ల 1.5 టన్ విండో ఏసీలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి అధిక పనితీరు మీకు వేసవి తాపాన్ని తెలియనీయవంటే అతిశయోక్తి కాదు. ఆ విండో ఏసీల వివరాలు ఇప్పుడు చూద్దాం..

వోల్టాస్‌ 1.5 టన్‌ 3 స్టార్‌, ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ విండో ఏసీ..

అమెజాన్ ప్లాట్ ఫారంలో ఈ ఏసీ ధర రూ.27,980. ఇది 230 వోల్టేజ్ పరిధిలో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌ను అందిస్తుంది. టైమర్, గ్లో లైట్ బటన్, ఆటో స్వింగ్ ఫంక్షనాలిటీ, యాంటీ-రస్ట్ కోటింగ్, ఎల్ఈడీ డిస్‌ప్లే, స్లీప్ మోడ్, టర్బో మోడ్, లో గ్యాస్ డయాగ్నసిస్, ఫిల్టర్ క్లీన్ ఇండికేటర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మంచి చాయిస్.

క్యారియర్ 1.5 టన్‌ 3 స్టార్‌ విండో ఏసీ..

క్యారియర్ 1.5 టన్‌ 3 స్టార్‌ విండో ఏసీ ధర అమెజాన్ ఇండియాలో రూ.28,499. దీనిలో ప్రత్యేకతలు ఏంటంటే ఆటో ఫ్యాన్ స్పీడ్, ఎనర్జీ సేవర్ మోడ్, ఎగ్జాస్ట్ కమాండ్, స్మార్ట్ టైమ్ గార్డ్, డ్రైమోడ్, త్రీ స్పీడ్ ఫ్యాన్ మోటార్, రూమ్ టెంపరేచర్ డిస్‌ప్లే, ఆటో రీస్టార్ట్ ఫంక్షనాలిటీ ఆకట్టుకుంటున్నాయి.

గోద్రేజ్‌ 1.5 టన్‌ 3 స్టార్‌ విండో ఏసీ..

ఈ ఏసీ రూ.29,599 ధరలో అందుబాటులో ఉంది. యాంటీ డస్ట్ ఫిల్టర్, స్లీప్ మోడ్, మెమరీ ఫంక్షన్‌తో ఆటో రీస్టార్ట్ ఫంక్షనాలిటీ, స్మార్ట్ డయాగ్నసిస్ టూల్ దీని ప్రత్యేకతలు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీ.

బ్లూస్టార్‌ 1.5 టన్‌ 3 స్టార్‌ ఫిక్స్‌డ్ స్పీడ్‌ విండో ఏసీ..

ఈ విండో ఏసీ ధర రూ.29,999. ఇది ఆటో కూల్ ఫ్యాన్ , డ్రై వంటి కంఫర్ట్ స్లీప్ మోడ్‌లను అందిస్తుంది. అదనంగా టర్బో కూలింగ్, ఎయిర్ ఫ్లో డైరెక్షన్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో ఆటో రీస్టార్ట్, నాలుగు ఫ్యాన్ మోడ్‌లు, డస్ట్ ఫిల్టర్లు, మల్టీ సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక ఫీచర్లతో రూపొందించారు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడెక్ట్ అని చెప్పవచ్చు.

హైయర్‌ 1.5 త్రీస్టార్‌ ఫిక్స్‌ స్పీడ్‌ టాప్‌ ఫ్లో విండో ఏసీ..

అమెజాన్ ఇండియాలో ఈ ఏసీ ధర రూ.28,850. దీని టాప్ ఫీచర్లలో డైనమిక్ కూలింగ్, ఎయిర్ స్వింగ్ ఫీచర్, సూపర్ మైక్రో యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్, యాంటీ-కారోసివ్ కోటింగ్ ఉన్నాయి. సామాన్యులకు అందుబాటులో ధరలో తయారు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..