ప్రతి మనిషికి పదవీ విరమణ గొప్ప అనుభూతినిస్తుంది. పదవీ విరమణ తర్వాత జీవితం సుఖమయం కావాలని అందరూ భావిస్తారు. పదవీ విరమణ తర్వాత కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అని కూడా అంటారు. ఎందుకంటే 60 ఏళ్ల పాటు కష్టపడి, సంపాదించి, కుటుంబ బాధ్యతలు మోసి, సంతానానికి పెళ్లిళ్లు చేసి, బాధ్యతలన్నీ ఫుల్ ఫిల్ చేశాక ఇక రిలాక్స్ అవడానికి అదొక మంచి సమయం. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ వారికి కథలు చెబుతూ కాలం గడపడం ఎంతో బాగుంటుంది. అలా పదవీవిరమణ కాలం గడపాలంటే ముందుగానే మీరు ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం మీకు ఉండాలి. అందుకోసం ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి ప్లానింగ్ అవసరం. కొన్నిమంచి పథకాలలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. పదవీవిరమణ తర్వాత మంచి రాబడులనిచ్చే ప్రభుత్వ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఇది పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకం ప్రారంభించవచ్చు. దీని ద్వారా కనీసం నెలవారీ పెన్షన్ రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000 లేదా రూ. 5,000 పొందే అవకాశం ఉంది. 60 ఏళ్ల వయసు నుంచి పింఛను అందజేస్తారు.
సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన మరో ప్రభుత్వ పథకం ఇది. దీని ద్వారా మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనిలో మీరు కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 30 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా లేదా జీవిత భాగస్వామితో సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. డిఫెన్స్ సర్వీస్‌ల రిటైర్డ్ సిబ్బంది అయితే 55 ఏళ్ల వయస్సులోనే ఖాతాను తెరవచ్చు. దీనిలో మీరు డిపాజిట్ చేయడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకంలో వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు.
దీనిలో పెట్టే పెట్టుబడికి బీమా తో పాటు రాబడులు కూడా ఉంటాయి. ఇది చాలా మందికి పదవీ విరమణ తర్వాత ఆదర్శవంతమైన పథకం. ఇక్కడ, పాలసీదారు జీవిత బీమా కవరేజ్ కోసం కొంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తారు, మిగిలిన మొత్తాన్ని డెట్ ఫండ్‌లు, ఈక్విటీ బండ్‌లు లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లలో పెట్టుబడి పెడతారు.
కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 9 లక్షల డిపాజిట్‌తో POMIS ఖాతాను తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాలకు గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. POMIS మెచ్యూరిటీ వ్యవధి.. ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు. వడ్డీ సంవత్సరానికి 7.4% చొప్పున నెలవారీగా చెల్లిస్తారు.
ఈ పథకం పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం యొక్క ప్రతి సబ్‌స్క్రైబర్‌కు ప్రత్యేకమైన శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) ఇవ్వబడుతుంది. మీరు ఈ పథకం కింద టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలను తెరవవచ్చు. మీరు టైర్ 1 ఖాతాలో కనీసం రూ. 500, టైర్ 2 ఖాతాను తెరిస్తే రూ. 1,000 చెల్లించాలి. టైర్ 1 ఖాతాలో చేసిన కంట్రిబ్యూషన్‌ల కోసం మీరు టైర్ 1లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. కానీ టైర్ 2 ఖాతాలో అలాంటి ప్రయోజనం ఏదీ అందుబాటులో ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..