Best Bicycles: మంచి సైకిల్ కొనాలనుకుంటున్నారా? రూ. 5వేలలోపు ధరలో బెస్ట్ సైకిల్స్ ఇవే..

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. మంచి ధృడమైన బాడీతో పాటు ఎక్కువ లైఫ్ ఉండే సైకిళ్లను కొనుగోలు చేయడానికి అందరూ చూస్తున్నారు. అదే సమయంలో దాని ధరను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి బెస్ట్ బైస్కిల్స్ అనువైన బడ్జెట్లో ఏమున్నాయి? ఆ జాబితానే మీకు అందిస్తున్నాం. రూ. 5000 ధరలో బెస్ట్ సైకిళ్లను మీకు పరిచయం చేస్తున్నాం.

Best Bicycles: మంచి సైకిల్ కొనాలనుకుంటున్నారా? రూ. 5వేలలోపు ధరలో బెస్ట్ సైకిల్స్ ఇవే..
Cycling

Updated on: Jan 28, 2024 | 9:35 AM

ఇటీవల కాలంలో సైకిళ్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. అందరూ సైక్లింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఆహార అలవాట్లు, మితిమీరిన పని ఒత్తిళ్లు, ఎక్కువ సేపు కూర్చొనే పనులు చేస్తుండటంతో శారీరక శ్రమ లేకుండా పోతోంది. ఈక్రమంలో వాకింగ్, సైక్లింగ్ చేయడానికి జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.దీంతో సైకిళ్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. మంచి ధృడమైన బాడీతో పాటు ఎక్కువ లైఫ్ ఉండే సైకిళ్లను కొనుగోలు చేయడానికి అందరూ చూస్తున్నారు. అదే సమయంలో దాని ధరను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి బెస్ట్ బైస్కిల్స్ అనువైన బడ్జెట్లో ఏమున్నాయి? ఆ జాబితానే మీకు అందిస్తున్నాం. రూ. 5000 ధరలో బెస్ట్ సైకిళ్లను మీకు పరిచయం చేస్తున్నాం. అలాగే పిల్లలకు ఉపయోగపడే సైకిళ్లను కూడా అందిస్తున్నాం.

లీడర్ స్కౌట్ ఎంటీబీ 26టీ మౌంటైన్ సైకిల్..

రూ. 5000 ధరలో బెస్ట్ సైకిల్ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఇది పదేళ్లకు పైనున్న పిల్లలకు ఇది సరిగ్గా సరిపోతోంది. దీని ఫ్రేమ్ పరిమాణం 18 అంగుళాల ఉంటుంది. సీ గ్రీన్ కలర్ ఆప్షన్ లో ఉంటుంది. ఇది మర్థవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణానికి హామీ ఇస్తుంది. దీని గేర్‌లెస్ ఆపరేషన్ రైడింగ్‌ను సులభతరం చేస్తుంది. సాధారణ రైడర్‌లకు లేదా రోజువారీ ప్రయాణికులకు అనువైనది. ఎందుకంటే దీని సింగిల్-స్పీడ్ డిజైన్ వాడుకలో సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

లైఫ్ లాంగ్ 26టీ సైకిల్ ఫర్ మెన్ అండ్ వుమెన్..

ఈ సైకిల్ పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటుంది. స్టైలిష్ బ్లాక్ అండ్ ఆరెంజ్ డిజైన్‌తో వస్తుంది. వైడ్ గా ఉండే ఎంటీబీ టైర్లు దీనికి ఉంటాయి. పర్వతారోహణకు కూడా ఇది సరిగ్గా సరిపోతాయి. ప్రీమియం సింగిల్ స్పీడ్ రిజిడ్ ఫోర్క్ గేర్ సైకిల్ – ప్యాడెడ్ సాడిల్, హై హ్యాండిల్ బార్ అండ్ సాఫ్ట్ రబ్బర్ గ్రిప్‌లతో వస్తుంది. ఇది బ్లాక్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రూ. 5000లోపు ధరలోనే డిస్క్ బ్రేక్‌ల సౌకర్యంతో ఇది వస్తుంది. సింగిల్-స్పీడ్ రిజిడ్ ఫోర్క్ గేర్ సిస్టమ్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

సైగా 12 అంగుళాల సైకిళ్లు..

మూడు నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ఈ 12 అంగుళాల లైట్ వెయిట్ సైకిళ్లు బాగాఉపయోగపడతాయి. తేలికైన, మన్నికైన మెగ్నీషియం అల్లాయ్ నిర్మాణం పిల్లలకు సరిగ్గా సరిపోతోంది. ఇది చూడటానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వయోలెట్ కలర్ ఆప్షన్లో ఉంటాయి.

లీడర్ స్పైడర్ 27.5టీ ఎంటీబీ సైకిల్..

ఈ సైకిల్ స్టైలిష్ మ్యాట్ బ్లాక్/ఆరెంజ్ ఫినిషింగ్‌, డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. రూ. 5000లోపు బడ్జెట్లో ఇది ఆదర్శనీయమైన ఎంపిక. 19-అంగుళాల ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. సింగిల్-స్పీడ్ సైకిల్ సాఫీగా, సమర్థవంతమైన రైడ్ ను అందిస్తుంది. ఆరెంజ్, మాట్టే బ్లాక్ కలయిక దాని రూపాన్ని శుద్ధి చేస్తుంది. మీరు ఆఫ్-రోడ్ ట్రాక్‌లలో ప్రయాణించినా లేదా పట్టణ ప్రాంతాలలో ప్రయాణించినా ఇది మంచి అనుభూతిని అందిస్తుంది.

హై ఫాస్ట్ గ్యాంగ్ స్టర్ 20టీ సైకిల్..

ఈ సైకిల్ ఏడు నుంచి పదేళ్ల పిల్లలకు సరిగ్గా సరిపోతాయి. బాలురు, బాలికలు ఎవరైనా దీనిని రైడ్ చేయొచ్చు. 20 అంగుళాలలోపు ఉత్తమమైన సైకిల్ ఇది . సెమీ అసెంబుల్డ్ డిజైన్‌ వస్తుంది. టైర్-ట్యూబ్ సెట్, సైడ్ స్టాండ్ సైక్లింగ్ అనుభవం అందిస్తుంది. దీని ధృడమైన ఫ్రేమ్ రైడ్ చేసేటప్పుడు స్థిరత్వాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..