Auto Sweep Facility: మీ పొదుపు ఖాతాలో సొమ్ముకు ఎఫ్‌డీ వడ్డీరేటు కావాలా.. వెంటనే ఆటో స్వీప్ చేసుకోండి..

|

Jul 28, 2024 | 5:27 PM

పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న డబ్బులపై అదనపు రాబడి అందజేయడానికి ఆటో స్వీప్ విధానం ఉపయోగపడుతుంది. అంటే మీ ఖాతాలో ఉండే పొదుపు నుంచి అదనపు నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలోకి ఆటోమెటిక్ గా బదిలీ చేస్తుంది. మీ పొదుపు ఖాతాలో నిర్ణీత పరిమితికి మంచి డబ్బులు ఉన్నప్పుడు వాటికి ఎఫ్ డీ ఖాతాలోకి బదిలీ చేస్తుంది. దీనినే స్వీప్ ఇన్ అంటారు.

Auto Sweep Facility: మీ పొదుపు ఖాతాలో సొమ్ముకు ఎఫ్‌డీ వడ్డీరేటు కావాలా.. వెంటనే ఆటో స్వీప్ చేసుకోండి..
Bank Account
Follow us on

దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకులలోనో, పోస్టాఫీసులలోనో పొదుపు ఖాతాలు ఉంటాయి. వాటిలో ఎంతో కొంత సొమ్ము నిల్వ ఉంటుంది. ఆ పొదుపు అలాగే కొనసాగుతుంది. దీనిపై సాధారణంగా వడ్డీరేటు చాలా తక్కువగా ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లలో నిర్ణీత కాలానికి సొమ్ము డిపాజిట్ చేస్తాం కాబట్టి దానిపై వడ్డీ అధికంగానే అందజేస్తారు. అయితే పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ముకు మాత్రం వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆటో స్వీప్ విధానం చాలా ఉపయోగపడుతుంది. మీ సేవింగ్ ఖాతాను ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాకు కనెక్ట్ చేసే సాధనాన్నే ఆటో స్వీప్ అంటారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

అదనపు రాబడి..

పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న డబ్బులపై అదనపు రాబడి అందజేయడానికి ఆటో స్వీప్ విధానం ఉపయోగపడుతుంది. అంటే మీ ఖాతాలో ఉండే పొదుపు నుంచి అదనపు నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలోకి ఆటోమెటిక్ గా బదిలీ చేస్తుంది. మీ పొదుపు ఖాతాలో నిర్ణీత పరిమితికి మంచి డబ్బులు ఉన్నప్పుడు వాటికి ఎఫ్ డీ ఖాతాలోకి బదిలీ చేస్తుంది. దీనినే స్వీప్ ఇన్ అంటారు. దీనివల్ల మీరు ఆ డబ్బులపై ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీ పొదుపు ఖాతా నుంచి పరిమితికి మించి డబ్బులు కావాలని అభ్యర్థించినప్పుడు ఎఫ్ డీలోని సొమ్మలు మీ పొదుపు ఖాతాకు బదిలీ అవుతాయి. దీనిని రివర్స్ స్వీప్ అంటారు. ఉదాహరణకు మీరు ఆటోస్వీప్ సదుపాయంతో పొదుపు ఖాతాను ప్రారంభించారు. దానిలో కనీస నిల్వ రూ.10 వేలు, మీరు దాదాపు రూ.50 వేలు డిపాజిట్ చేయాలి అలాగు థ్రెషోల్డ్ పరిమితి రూ.20 వేలుగా నిర్ణయించారు. ఈ సందర్భంలో ఖాతాలోని మిగిలిన రూ.30 వేలు ఎఫ్ డీ ఖాతాకు బదిలీ అవుతాయి. దీంతో రెండు ఖాతాల ద్వారా వడ్డీ అందుతుంది.

మరిన్ని ఉపయోగాలు..

ఆటో స్వీప్ సౌకర్యం ద్వారా మీ పొదుపుపై ఎఫ్ డీ ఖాతాల వడ్డీ లభిస్తుంది. సాధారణ పొదుపులతో పోలిస్తే మెరుగైన రాబడిని అందిస్తుంది. ఎస్ బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. ఆటో స్వీప్ వల్ల కలిగే ప్రయోజనాలు .

మెరుగైన రాబడి.. సాధారణ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మధ్య వడ్డీ రేట్ల తేడాతో మెరుగైన రాబడి లభిస్తుంది.

లాక్-ఇన్ పీరియడ్.. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా ఈ విధానంలో నిధులను యాక్సెస్ చేయడానికి లాక్-ఇన్ పీరియడ్ లేదు. కానీ ప్రయోజనాలు పొందవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆటో స్వీప్ సౌకర్యాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనిపై ఎస్ బీఐ ఖాతాదారులకు దశల వారీగా సూచనలు అందిస్తోంది.

యోనో యాప్.. ఎస్ బీఐ యోనో మొబైల్ యాప్‌ ను ఉపయోగించుకుని ఆటో స్వీప్ ఫెసిలిటీని ఎనేబుల్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..