ఏదైనా సురక్షిత పెట్టుబడి పథకం గురించి చెప్పమంటే ఎవరైనా టక్కున చెప్పే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). దీనిలో స్థిరమైన వడ్డీతో కచ్చితమైన రాబడి వస్తుంది. అందుకే ఇవి అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. సాధారణంగా వీటిని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో ఈ పథకాలు ఉంటాయి. అయితే వాటిల్లో కంటే అధిక వడ్డీని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కళ్లు చెదిరే వడ్డీని రేటును అందిస్తాయి. గరిష్టంగా 9% వరకూ వడ్డీ రేట్లు పొందవచ్చు. ఒకవేళ మీరు పెట్టే పెట్టుబడిపై అధిక వడ్డీ రావాలని కోరుకుంటే మాత్రం వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. వాటిల్లో ప్రయోజనాలు ఏంటి? నిబంధనలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి. ఈ కథనం మార్కెట్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..
ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్లపై పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మంచి వడ్డీ రేటును అందిస్తాయి. గరిష్టంగా 9శాతం వరకూ వడ్డీని అందిస్తాయి. అయితే ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై మాత్రమే అందుతాయ. ఈ బ్యాంకుల జాబితా ఇది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..