BNPL: క్రెడిట్ కార్డులకు సూపర్ ప్రత్యామ్నాయం.. దీనితో డబ్బుల్లేకుండా షాపింగ్ చేయొచ్చు..

|

Sep 17, 2024 | 6:22 PM

పేదరికం, తక్కువ ఆదాయం తదితర అంశాలు దీనికి కారణమవుతాయి. ఇలాంటి వారందరి కోసం బైనౌ పేమెంట్ లేటర్ (బీఎన్‌పీఎల్) అనే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. వివిధ యాప్, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. దీని ద్వారా ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. డబ్బులను తర్వాత కట్టవచ్చు.

BNPL: క్రెడిట్ కార్డులకు సూపర్ ప్రత్యామ్నాయం.. దీనితో డబ్బుల్లేకుండా షాపింగ్ చేయొచ్చు..
Bnpl Policy
Follow us on

ప్రతి ఒక్కరికీ తమ జీవన ప్రయాణంలో వివిధ రకాల వస్తువులు అవసరమవుతాయి. వాటిని కొనుగోలు చేసే అవకాశం అందరికీ లేకపోవచ్చు. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తమ అవసరాలను వాయిదా వేసుకుంటారు. పేదరికం, తక్కువ ఆదాయం తదితర అంశాలు దీనికి కారణమవుతాయి. ఇలాంటి వారందరి కోసం బైనౌ పేమెంట్ లేటర్ (బీఎన్‌పీఎల్) అనే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. వివిధ యాప్, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. దీని ద్వారా ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. డబ్బులను తర్వాత కట్టవచ్చు. ఈ పేమెంట్ విధానం చాలా సులభంగా ఉంటుంది. దీని ఈఎంఐలకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు, ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు, లోన్లకు ప్రత్యామ్నాయంగా బీఎన్ పీఎల్ విధానం బాగా పాపులర్ అయ్యింది. అంటే డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల కలిగే లాభ, నష్టాలు ఇలా ఉన్నాయి.

అనుకూల అంశాలు..

కొనుగోలు శక్తి పెరుగుదల.. బీఎన్ పీఎల్ విధానంలో ఖాతాదారులు తక్షణమే ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాటికి డబ్బులను కాలక్రమీణా చెల్లిస్తారు. దీని వల్ల కొనుగోలు శక్తి పెరిగి, మార్కెట్ పుంజుకుంటుంది. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వారి అవసరాలు తీరడంతో పాటు మార్కెట్ లో అమ్మకాలు పెరుగుతాయి.

సౌలభ్యం.. బీఎన్ పీఎల్ విధానానికి దరఖాస్తు ప్రక్రియ సులువుగా ఉంటుంది. కనీస డాక్యుమెంటేషన్ సరిపోతుంది. తక్షణమే ఆమోదం లభిస్తుంది. అవసరమైనప్పుడు క్రెడిట్ పొందడం సులభం అవుతుంది.

వడ్డీ.. బీఎన్ పీఎల్ సేవలు ఖాతాదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. సకాలంలో చెల్లింపులు చేసిన వారికి వడ్డీ రహిత కొనుగోళ్లు అందిస్తాయి. సాంప్రదాయ క్రెడిట్ కార్డులతో పోల్చితే ఈ విధానం చాలా ఉపయోగంగా ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు.. వీటిలో సౌకర్యవంతమైన రీపేమెంట్ ప్లాన్లు ఉంటాయి. వినియోగదారులు తమ ఆర్థిక పరిస్థితికి బాగా సరిపోయే నిబంధనలను ఎంచుకోవడానికి వీలుంటుంది.

మెరుగైన ఆర్థిక నిర్వహణ.. వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఏక మొత్తంలో కాకుండా కాలక్రమీణా డబ్బులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆర్థిక ప్రణాళికకు ఇబ్బంది ఉండదు.

ప్రతికూలతలు..

ఖర్చు పెరిగే అవకాశం.. బీఎన్ పీఎల్ విధానం ఉండడం వల్ల అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులు పెరిగిపోతాయి. అది మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది. ఈ విధానంలో అవసరమైన మేరకే కొనుగోళ్లు జరుపుకోవాలి.

జరిమానాలు.. వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే ఆలస్య రుసుములు, భారీ ఫీజులు పడే అవకాశం ఉంది.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం.. బీఎన్ పీఎల్ ను తరచూ ఉపయోగించడం, లేదా తప్పుగా నిర్వహించడం వల్ల క్రెడిట్ స్కోర్‌ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. చెల్లింపులు తప్పిపోయినా, ఆలస్యమైనా ఇబ్బందులు కలుగుతాయి.

నియంత్రణ.. బీఎన్ పీఎల్ పథకాలు కొత్తవి కావడంతో వాటిపై నియంత్రణ తక్కువగా ఉంటుంది. వీటి వల్ల వినియోగదారులు దోపిడీకి గురయ్యే అవకాశం కూడా ఉంది.

నిబంధనలు.. కొన్ని సార్లు బీఎన్ పీఎల్ సేవలకు సంబంధించి సంక్లిష్ట నిబంధనలు, షరతులు ఉంటాయి. వినియోగదారులు వాటిని పూర్తి చదివి, అవగాహన చేసుకోవడం చాలా అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..