
Petrol Pump Free Facilities: సాధారణంగా మనం వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించడానికి బంకుకు వెళ్తుంటాం. ఇంధనం నింపుకున్నాక డబ్బులు ఇచ్చి వెంటనే వచ్చేస్తాం. కానీ, పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల కోసం ఉచితంగా లభించే కొన్ని వస్తువులు, సౌకర్యాలు ఉంటాయని మీకు తెలుసా? ఇప్పటి వరకు ఈ విషయాలు చాలా మందికి తెలియవు. పైగా వినియోగదారుల్లో అవగాహన లేకపోవడమే కారణం. బంకుకు వెళ్లే సగం మందికి పైగా ఈ విషయాలు తెలియవు. అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ ఉచిత సేవల కోసం బయట అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు ఈ కింది సేవలను తప్పనిసరిగా ఉచితంగా అందించాలి.
ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మీ వాహన టైర్లలో సరైన మోతాదులో గాలి ఉండటం ప్రయాణానికి చాలా ముఖ్యం. ప్రతి పెట్రోల్ బంకులో డిజిటల్ మెషీన్ల ద్వారా ఉచితంగా గాలి నింపే సౌకర్యం ఉంటుంది. చాలా బంకుల్లో దీని కోసం ప్రత్యేకంగా ఒక సిబ్బందిని కూడా నియమిస్తారు. దీని కోసం మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా చిన్నపాటి ప్రమాదం లేదా గాయం జరిగితే, అత్యవసర చికిత్స కోసం మీరు పెట్రోల్ బంకులోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో అవసరమైన మందులు, బ్యాండేజీలు ఉంటాయి. బంక్ యజమానులు ఈ కిట్‌లోని మందుల ఎక్స్‌పైరీ డేట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి లేదా ప్రయాణ అలసట పోగొట్టుకోవడానికి ప్రతి పెట్రోల్ బంకులో ఉచిత తాగునీటి సదుపాయం ఉండాలి. ఇక్కడ RO వాటర్ లేదా వాటర్ కూలర్ ద్వారా స్వచ్ఛమైన, చల్లని తాగునీటిని అందిస్తారు.
సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడే సౌకర్యం. ప్రతి పెట్రోల్ పంపులో పురుషులకు, మహిళలకు విడివిడిగా పరిశుభ్రమైన వాష్‌రూమ్ సదుపాయం ఉండాలి. ఇది కేవలం వాహనదారులకే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తుంది.
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి (Emergency) ఎదురైనా.. మీరు పెట్రోల్ బంక్ లోని ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఉచితంగా ఒక కాల్ చేసుకోవచ్చు.
పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపేటప్పుడు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుంటే, వాటిని ఆర్పడానికి అవసరమైన ఫైర్ సేఫ్టీ డివైజ్‌లు (అగ్నిమాపక సిలిండర్లు), ఇసుక బకెట్లు అక్కడ సిద్ధంగా ఉండాలి. ప్రమాద సమయంలో వీటిని ఎవరైనా ఉచితంగా ఉపయోగించవచ్చు.
పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఈ ఉచిత సేవలను అందించడానికి నిరాకరించినా, లేదా వీటి కోసం మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా మీరు వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి బంకులో ఫిర్యాదుల పుస్తకం (Complaint Book) ఉంటుంది. ఒకవేళ వారు స్పందించకపోతే, సంబంధిత పెట్రోలియం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆ బంక్‌పై ఆన్‌లైన్‌లో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మరింత తగ్గుతున్న బంగారం ధరలు.. నాలుగు రోజుల్లో ఎంత తంగ్గిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి