కొంచెం రిస్క్ చేసినా పర్వాలేదు. వడ్డీ బాగా ఎక్కువగా రావాలని ఆశించే వారికి కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ డీలను బ్యాంకులు అమలు చేస్తే, కార్పొరేట్ ఎఫ్ డీలను కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్ సీలు) అమలు చేస్తాయి. కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కాల వ్యవధి తక్కువగా ఉంటుంది. బ్యాంకులతో పోల్చితే ఇక్కడ ఎక్కువ వడ్డీ అందిస్తారు. కానీ వీటిని ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా కంపెనీల రేటింగ్ ను పరిశీలించి డిపాజిట్ చేయాలి. ఎందుకంటే బ్యాంకుల విషయంలో రూ.5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ పథకంలో రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ సంస్థలు, ఎన్బీఎఫ్ సీలలో ఆ అవకాశం ఉండదు. ఒకవేళ ఆ కంపెనీ దివాళా తీస్తే డిపాజిట్లు వెనక్కి రావడం చాలా కష్టం. వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఎఫ్ డీలపై ఇస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేట్ ఎఫ్ డీలను అమలు చేస్తున్న కంపెనీలు, సంస్థలకు కేర్, ఐసీాఆర్ఏ, క్రిసిల్ వంటి ప్రసిద్ధ సంస్థలు రేటింగ్ ను ఇస్తాయి. వాటిని పరిశీలించి డిపాజిట్లు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ బ్యాంకులు ఈ ఎఫ్ డీలను నియంత్రిస్తాయి. కొంచెం రిస్కు ఉన్నప్పటికీ సాధారణ బ్యాంకులతో పోల్చితే ఇక్కడ తక్కువ కాలవ్యవధికే అత్యధిక వడ్డీ పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి