AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Early loan payments: బ్యాంకు రుణాన్ని ముందుగా చెల్లిస్తే ఇన్ని ప్రయోజనాలా..? అవేంటో తెలిస్తే షాక్

అత్యవసర ఖర్చులు, వైద్యం, చదువు, ఇంటి కొనుగోలు తదితర అవసరాల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పొందుతారు. వాటిని వడ్డీతో కలిపి నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఆ రుణాలను తీర్చడానికి కాలపరిమితి ఎక్కువగానే ఉంటుంది. అయితే రుణాన్ని తొందరగా తీర్చడానికి, వీలుంటే ఏడాదికి రెండు, మూడు వాయిదాలు ఎక్కువ కట్టడానికి చాలా మంది ఆసక్తి చూపించారు. బ్యాంకు ఇచ్చిన కాలపరిమితిలోపు రుణం చెల్లిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే ముందస్తుగా రుణం చెల్లించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Early loan payments: బ్యాంకు రుణాన్ని ముందుగా చెల్లిస్తే ఇన్ని ప్రయోజనాలా..? అవేంటో తెలిస్తే షాక్
Loans
Nikhil
|

Updated on: Jun 26, 2025 | 3:00 PM

Share

క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవడానికి ముందస్తు రుణం చెల్లింపులు ఎంతో దోహదపడతాయి. మన దేశంలో ఆర్బీఐ లైసెన్సు పొందిన ట్రాన్స్ యూనియన్ సిబిల్ , ఎక్స్ పీరియన్, ఈక్విఫ్యాక్స్, సీఆర్ ఐఎఫ్ హైమార్క్ అనే నాలుగు క్రెడిట్ బ్యూరోలు మన క్రెడిట్ స్కోర్ ను జారీ చేస్తాయి. సాధారణంగా 300 నుంచి 900 వరకూ స్కోర్ కేటాయిస్తారు. అది 750 కంటే ఎక్కువగా ఉంటే మెరుగైనదిగా భావిస్తారు. బ్యాంకు రుణాలు పొందటానికి, క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఇది చాలా కీలకంగా ఉంటుంది. ఒక వ్యక్తికి క్రెడిట్ స్కోర్ కేటాయించే ముందు క్రెడిట్ బ్యూరోలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటిలో చెల్లింపుల చరిత్ర ప్రధానంగా ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో పరిశీలిస్తారు.

ఆ లావాదేవీలకు సుమారు 35 నుంచి 40 శాతం వెయిటేజీ ఇస్తారు ఇక క్రెడిట్ కార్డు వినియోగాన్ని కూడా లెక్కిస్తారు. పరిమితి మొత్తాన్ని మించి వాడితే స్కోర్ తగ్గిపోతుంది. దీనికి 20 నుంచి 25 శాతం ప్రాధాన్యం ఉంటుంది. క్రెడిట్ మిశ్రమం, వ్యవధి తదితర వాటికి 20 నుంచి 25 శాతం, కొత్త క్రెడిట్ విచారణలకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఎందుకంటే తక్కువ అప్పును తక్కువ రిస్కుగా బ్యాంకులు భావిస్తాయి. కాలపరిమితికి కన్నా ముందే వాయిదాలను చెల్లిస్తూ ఉంటే రుణభారం తగ్గిపోతుంది. కాలక్రమంలో మీ క్రెడిట్ స్కోర్ పై సానుకూల ప్రభావం చూపుతుంది. తీసుకున్న రుణాలకు ఈఎంఐలను సకాలంలో చెల్లించడం, రుణాన్ని ముందస్తుగా కట్టడం వల్ల క్రెడిట్ బ్యూరోలు మీకు క్లీన్ రీపేమెంట్ హిస్టరీని నమోదు చేస్తాయి. సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు ఏడేళ్ల వరకూ చెల్లింపుల డేటాను దాచుకుంటాయి.

ముందస్తు రుణ చెల్లింపుల వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుందనే విషయం వాస్తవమే అయినప్పటికీ ఈ కింద విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు తక్కువ రుణం తీసుకుంటే, ఆ రుణాన్ని ముందుగానే చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ అక్కడితో ఆగిపోవచ్చు. అదే మీరు మరో రుణానికి దరఖాస్తు చేసుకుంటే, ముందస్తు చేసిన చెల్లింపులు బాగా ఉపయోగపడతాయి. తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం కలుగుతుంది. అలాగే వ్యక్తులకు అందించే ఫ్లోటింగ్ రేటు వ్యక్తిగత రుణాలపై ముందస్తు చెల్లింపులకు బ్యాంకులు జరిమానా విధించడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అయితే ఇది అన్ని రకాల రుణాలకు వర్తించదు. కాబట్టి ముందస్తు చెల్లింపులు చేసేటప్పుడు అన్ని విషయాలను గమనించడం చాాలా ముఖ్యం.]

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us