Maruti Suzuki EVX: మారుతి సుజుకీ నుంచి అదిరిపోయే ఈవీ ఎస్‌యూవీ.. లాంచ్‌కు ముందే పోలాండ్‌లో దర్శనం.. పూర్తి వివరాలివే..!

|

Jun 24, 2023 | 5:45 PM

టూ వీలర్‌తో పోల్చుకుంటే ఫోర్ వీలర్ వాహనాలను రిలీజ్ చేయడంలో కంపెనీలు కొంచెం తటపటాయిస్తూ ఉంటున్నాయి. మైలేజ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల కోసం అన్ని కంపెనీలు పరీక్షలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ మారుతీ సుజుకీ ఈవీ వాహనాల మార్కెట్‌లో తన మార్క్‌ను చూపేందుకు సరికొత్త ఈవీ కార్‌ను లాంచ్ చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మారుతీ ఈవీఎక్స్‌ను రోడ్లపై పరీక్షిస్తున్నట్లు తేలింది.

Maruti Suzuki EVX: మారుతి సుజుకీ నుంచి అదిరిపోయే ఈవీ ఎస్‌యూవీ.. లాంచ్‌కు ముందే పోలాండ్‌లో దర్శనం.. పూర్తి వివరాలివే..!
Maruti Evx
Follow us on

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ బ్రాండ్ కంపెనీల వరకూ ప్రతి ఒక్కరూ తమ కంపెనీల తరఫును ఈవీ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు భారతదేశంలో ఈవీ వాహనాల కొనుగోలు వేగంగా వృద్ధి చెందుతుంది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లో అత్యధిక ఈవీలు అమ్ముడుపోతున్నాయంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ మోడల్స్‌ను భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. టూ వీలర్‌తో పోల్చుకుంటే ఫోర్ వీలర్ వాహనాలను రిలీజ్ చేయడంలో కంపెనీలు కొంచెం తటపటాయిస్తూ ఉంటున్నాయి. మైలేజ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల కోసం అన్ని కంపెనీలు పరీక్షలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ మారుతీ సుజుకీ ఈవీ వాహనాల మార్కెట్‌లో తన మార్క్‌ను చూపేందుకు సరికొత్త ఈవీ కార్‌ను లాంచ్ చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మారుతీ ఈవీఎక్స్‌ను రోడ్లపై పరీక్షిస్తున్నట్లు తేలింది. పోలాండ్‌లోని క్రాకోవ్‌లోకి చార్జింగ్ స్టేషన్‌లో ఈ కార్ దర్శనమిచ్చింది. ఈ కార్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

మారుతీ ఈవీఎక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఇది మారుతీ కంపెనీలకు చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. అంతర్గతంగా దీన్ని వైవై8గా పిలుస్తున్నారు. దీంతో ఈ కార్‌పై వాహనప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ముందుగా ప్రకటించిన కాన్సెప్ట్ వెర్షన్‌తో పోలిస్తే ప్రస్తుతం రోడ్లపై కనిపించిన ప్రోటోటైప్ కొద్దిగా టోన్ డౌన్ స్టైలింగ్‌తో వస్తుంది. అలాగే ఈ కార్‌కు స్పోర్టీ లుక్‌ను అందించడానికి ఈ కార్‌కు టేపరింగ్ రూఫ్‌లైన్‌తో వస్తుంది. ఎల్ఈడీ స్ట్రిప్‌తో ఎడ్జీ టెయిల్ ల్యాంప్‌ల వాడకంతో ఈ కార్ మరింత ఎలివేటెడ్ లుక్‌తో వస్తుంది,

ఈ కార్ 4300 మీమీ పొడవు,  1800 మిమి వెడల్పు, 1600 మిమి ఎత్తుతో వస్తుంది. సి పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటినా, ఇంటీరియర్‌‌లో మినిమలిస్టిక్ డిజైన్‌ను ఉపయోగించారు. ఈ కారు ప్రస్తుతం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెంట్రల్ కన్సోల్లో రోటరీ కంట్రోల్ డయల్‌తో రెండు-స్పోక్ బాటమ్ స్టీరింగ్ వీల్‌ను ఉపయోగిస్తుంది. మౌంటెడ్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆకర్షణీయంగా ఉంది. పూర్తి డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్ ఈ కార్ ప్రత్యేకత. అయితే భారతీయ మోడల్లో రైట్ హ్యాండ్ డ్రైవ్‌తో వస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ కార్ 60 కేడబ్ల్యూహెచ్ ప్యాక్‌తో 550 కిలో మీటర్ల పరిధిని అందించే అవకాశం ఉంది. ఈ కార్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లో విడుదల చేస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..