Gas Cylinder Price: మీరు కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలని ఆలోచిస్తుంటే మీకో శుభవార్త ఉంది. ఇప్పుడు మీరు LPG సిలిండర్‌ను చౌకగా పొందవచ్చు. దేశంలోని ప్రభుత్వ చమురు సంస్థ వినియోగదారుల కోసం ఒక మంచి ఎంపికను తీసుకొచ్చింది. ఇందులో మీరు రూ. 633కే గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చు. దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ గ్యాస్ సిలిండర్ చాలా ఉపయోగపడుతుంది. Indane కంపెనీ తన కస్టమర్ల సౌలభ్యం కోసం కాంపోజిట్ సిలిండర్‌ని అందిస్తోంది. మీరు ఈ సిలిండర్‌ను కేవలం రూ.633 కే తీసుకోవచ్చు. అంతేకాదు దీనిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ కుటుంబం చిన్నదైతే ఇది మీకు ఉత్తమ ఎంపిక అవుతుంది. కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉంటాయి. ఇందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ కారణంగా ఈ సిలిండర్ల ధర తక్కువగా ఉంటుంది. ఈ సిలిండర్ ప్రత్యేకత ఏంటంటే చాలా పారదర్శకంగా ఉంటాయి.
ఈ కాంపోజిట్ సిలిండర్ ప్రస్తుతం 28 నగరాల్లో అందుబాటులో ఉంది. అయితే ఇవి త్వరలో అన్ని నగరాల్లో అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ తెలిపింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సిలిండర్ ధర ముంబైలో రూ.634, కోల్‌కతాలో రూ.652, చెన్నైలో రూ.645, లక్నోలో రూ.660, ఇండోర్‌లో రూ.653, భోపాల్‌లో రూ.638, గోరఖ్‌పూర్‌లో రూ.677గా ఉంది. కాగా ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధర భారీగా తగ్గింది. కమర్షియల్ సిలెండర్ ధరను 91 రూపాయల 50 పైసలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలెండర్ ధరల్లో మాత్రం ఏ విధమైన మార్పు లేదు. గత నెలలో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.