Silver Imports: కేంద్రం కీలక నిర్ణయం.. వెండి దిగుమతులపై బ్యాన్‌

Silver Imports: దేశంలోకి వెండి దిగుమతులు అకస్మాత్తుగా పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం పడకుండా చూసేందుకు, అలాగే స్థానిక వెండి వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వం ఈ ఆంక్షల నుండి కొన్ని విభాగాలకు..

Silver Imports: కేంద్రం కీలక నిర్ణయం.. వెండి దిగుమతులపై బ్యాన్‌
Silver

Updated on: May 16, 2026 | 8:23 PM

Silver Imports: వెండి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం వెండి దిగుమతి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాలను పెంచిన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకుంటోంది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్, వాణిజ్య సమతుల్యతపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అన్ని రూపాల్లో వెండి దిగుమతులను నిషేధించింది.

దేశీయ పరిశ్రమలను రక్షించడానికి, అనవసరమైన దిగుమతులను నియంత్రించడానికి భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలను (Import Curbs) విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వెండి దిగుమతుల విధానాన్ని ఉచితం కేటగిరీ నుండి మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పాలసీ మార్పు ప్రకారం.. ఇప్పటివరకు వెండిని ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి వీలుండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, దీనిని ‘పరిమితం’ (Restricted) కేటగిరీలోకి చేర్చారు. అంటే ఇకపై వెండిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుండి ముందస్తు లైసెన్స్ లేదా ప్రత్యేక అనుమతి తప్పనిసరి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మినహాయింపులు:

ప్రభుత్వం ఈ ఆంక్షల నుండి కొన్ని విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్‌బీఐ (RBI) ద్వారా అనుమతించిన ఏజెన్సీలు, ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దేశిత బ్యాంకులు/సంస్థలు యథావిధిగా వెండిని దిగుమతి చేసుకోవచ్చు. దేశంలోకి వెండి దిగుమతులు అకస్మాత్తుగా పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం పడకుండా చూసేందుకు, అలాగే స్థానిక వెండి వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us