Tax Notice: ఈ కంపెనీకి 6236 కోట్ల పన్ను నోటీసు.. షేర్ పడిపోవచ్చు!

|

Oct 14, 2023 | 5:37 PM

భారత దేశంలో ఈ కంపెనీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా పనిచేసింది. లాభంలో 1.68% వృద్ధి నమోదైంది. గతేడాది కంపెనీ లాభం రూ.68.25 కోట్లు. ఈ ఏడాది కంపెనీ 69.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. అయితే ఒక నోటీసు కంపెనీ ఆనందాన్ని దెబ్బతీసింది. 6236.81 కోట్ల పన్ను నోటీసును ఈ కంపెనీకి GST కార్యాలయం..

Tax Notice: ఈ కంపెనీకి 6236 కోట్ల పన్ను నోటీసు.. షేర్ పడిపోవచ్చు!
Tax Notic
Follow us on

ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు జీఎస్టీని ఎగ్గొట్టేస్తున్నాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే నోటీసులు అందిస్తున్నామని కూడా వెల్లడిస్తోంది. అయితే భారత దేశంలో ఈ కంపెనీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా పనిచేసింది. లాభంలో 1.68% వృద్ధి నమోదైంది. గతేడాది కంపెనీ లాభం రూ.68.25 కోట్లు. ఈ ఏడాది కంపెనీ 69.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. అయితే ఒక నోటీసు కంపెనీ ఆనందాన్ని దెబ్బతీసింది. 6236.81 కోట్ల పన్ను నోటీసును ఈ కంపెనీకి GST కార్యాలయం జారీ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3700 కోట్లు. దీంతో ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. ఈ వార్తల ప్రభావం ఈ కంపెనీ షేర్లపై కనిపిస్తోంది .

డెల్టా కార్పొరేషన్‌లో భూకంపం:

ఈ కంపెనీ డెల్పా కార్ప్. దాని అనుబంధ సంస్థ డెల్టా టెక్ గేమింగ్ నోటీసును అందుకుంది. డెల్టా టెక్‌పై రూ. 6236.81 కోట్ల జీఎస్టీ డిమాండ్ చేయబడింది. ఈ నోటీసు నేరుగా కంపెనీ స్టాక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కంపెనీ షేర్ ఒక్క నెలలోనే 21 శాతం పడిపోయింది. కంపెనీ షేరు ఒక్క ఏడాదిలోనే 40 శాతం క్షీణించింది. శుక్రవారం కంపెనీ షేరు నష్టాల్లో ముగిసింది. ఈ షేరు 0.85 శాతం పడిపోయింది. గత సెషన్‌లో ఈ షేరు రూ.140 వద్ద ముగిసింది.

ఆదాయం పెరిగింది:

రెండో త్రైమాసికం లో కంపెనీ పటిష్ట పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ లాభం 1.75 శాతం పెరిగింది. లాభం రూ.69.4 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికం లో ఈ సంఖ్య రూ.68.2 కోట్లు. ఈ కంపెనీ వార్షిక ఆదాయం రూ.270 కోట్ల నుంచి రూ.271 కోట్లకు చేరింది. కంపెనీ EBITDA స్వల్పంగా క్షీణించింది. వార్షిక ప్రాతిపదికన 100.4 కోట్ల నుండి 100.3 కోట్ల వరకు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అనిల్ మలానీని, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ గా మనోజ్ జైన్‌ ను నియమించింది.

ఇవి కూడా చదవండి

జీఎస్టీ క్లెయిమ్ అంటే ఏమిటి?

డెల్టా కార్ప్ తక్కువ జీఎస్టీ చెల్లించిందని జీఎస్టీ విభాగం పేర్కొంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కింద కంపెనీకి నోటీసు లు జారీ చేశారు. ఈ నోటీసు 1 జూలై 2017 నుంచి 31 మార్చి 2022 వరకు జారీ చేయబడింది. డెల్టాతో పాటు డ్రీమ్ 11 కంపెనీలకు కూడా జీఎస్టీ నోటీసులు జారీ అయ్యాయి.