Fisker Inc: ఎలాన్ మస్క్ టెస్లాకు ప్రత్యర్ఠి అయిన Fisker Inc భారత్ లో తన ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్‌లో(Hyderabad) ఏర్పాటు చేసింది. ఇది కాలిఫోర్నియాలో న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేంజ్(New York stock Exchange ) లో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ లిస్ట్ అయింది. తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి ఇటీవల డీల్ పూర్తి కావడానికి ముందు కాలిఫోర్నియాలోని మాన్‌హట్టన్ బీచ్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ భారత శాఖకు ‘ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అని పేరును నిర్ణయించారు. భారత మార్కెట్లో విస్తరణ, గ్లోబల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో హెన్రిక్ ఫిస్కర్ అన్నారు. ప్రస్తుతం సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 450 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి సంఖ్యను ఏడాది చివరి నాటికి 800 చేర్చాలని కంపెనీ భావిస్తోంది. దీనికి సంబంధించి స్తానికులను నియమించుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆల్-ఎలక్ట్రిక్ ఫిస్కర్ ఓషన్ SUV ఉత్పత్తి ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఫిస్కర్.. తయారీ భాగస్వామి మాగ్నా స్టెయిర్ సైట్‌లో నవంబర్ 17, 2022న ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.
ప్రముఖ సాంకేతిక ప్రతిభ కోసం ప్రపంచ రేసులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త ఆపరేషన్స్ ను ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనంగా చూస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత్ లో పెరుగుతున్న టాలెంట్ పూల్‌లోకి ప్రవేశించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఇందుకు సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కంపెనీ ధన్యవాదాలు తెలిపింది.
ఫిస్కర్ ఓషన్ టెస్లా మోడల్ Yకి పోటీదారు, స్పోర్ట్ ట్రిమ్‌లో 440 కిలోమీటర్ల వరకు, ఎక్స్‌ట్రీమ్ ట్రిమ్‌లో 630 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫిస్కర్ గతంలో ఓషన్ ఎస్‌యూవీని భారత్ లో ప్రవేశపెట్టాలని భావించింది. అయితే ఈ విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఇవీ చదవండి..
Cooking Oil: పెరగనున్న పామాయిల్ ధరలు.. త్వరలోనే వంటింటికి కొత్త కష్టాలు.. కారణమేంటంటే..
HUL Price Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల నుంచి డిటర్జెంట్ల వరకూ రేట్లు పెంచేసిన FMCG దిగ్గజం..