
ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంటే అంత సులవైనది కాదు. ఎంతో ప్రాసెస్ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందు కోసం ఎయిర్‌ఫోర్ట్స్ అథారిటీ ఇఫ్ ఇండియా (AAI) కరసత్తు చేస్తోంది. ఈ విమానాశ్రయాలు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కసరత్తు చేస్తోంది.ఈ విమానాశ్రయాలు రాబోయే రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఖరీదైన కారు నంబర్ ప్లేట్.. దీని ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఈ విమానాశ్రయాల ఏర్పాటు కోసం అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను సైతం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ విమానాశ్రయాల ఏర్పాటు పనులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా చిన్న విమానాలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఏఏఐ భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పెద్ద విమానాలు (A320, B737), కార్గో విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్ణయించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతో తెలుసా?
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వాయుసేన అనుమతులు:
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి భారత వాయుసేన అనుమతులు లభించాయి. ఇక్కడ ఇప్పటికే వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన అదనపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. స్థానిక పరిస్థితులను బట్టి 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం తెలిపినట్లు తెలుస్తోంది. వీటితో పాటు, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలంగాణలోని వరంగల్‌లోని మామ్నూర్‌లో విమానాశ్రయం నిర్మించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ ఏడాది మార్చిలో తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం పనులు ప్రారంభమైన రెండున్నర సంవత్సరాలలో పూర్తవుతుందని అన్నారు. విమానాశ్రయానికి రన్‌వే, టెర్మినల్ భవనం, అదనపు సౌకర్యాలతో సహా కనీసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా, కేంద్ర విమానయానశాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి.. నలుగురు సీరియస్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి