Telugu News Business TCS' Rajesh Gopinathan Is One Of The Highest Paid CEOs in India. Check His Salary And Other Details
India Top-5 CEO Salary: భారత్‌లో అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్-5 సీఈఓలు వీరే.. !
దేశంలో ఇన్ఫోసిస్ నుంచి టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ వరకు అనేక ఐటి దిగ్గజాలు ఉన్నాయి. వీటి వ్యాపారం దేశవ్యాప్తంగా, విదేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కంపెనీలు..
దేశంలో ఇన్ఫోసిస్ నుంచి టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ వరకు అనేక ఐటి దిగ్గజాలు ఉన్నాయి. వీటి వ్యాపారం దేశవ్యాప్తంగా, విదేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కంపెనీలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఈ కంపెనీల సీఈవోలు ఎవరో తెలుసా? వారి జీతం ఎంత? అత్యధికంగా చెల్లించే 5 సీఈవోల గురించి తెలుసుకోండి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చివరిగా అంటే 5వ స్థానంలో ఉన్నారు. అతను సెప్టెంబర్‌లో టీసీఎస్ నుంచి ఈ పదవిని విడిచిపెట్టాడు. 2022లో అతనికి 25.75 కోట్లు పరిహారం అందించారు. అతని వార్షిక వేతనంలో 26.6 శాతం పెరుగుదల ఉంది.
టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సిపి గుర్నానీ నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని జీతం గత సంవత్సరం 189 శాతం పెరిగింది. అలాగే రూ. 63.4 కోట్లు తీసుకున్నారు.
ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓ సలీల్ పారిఖ్ 2022లో రూ. 71.02 కోట్లు తీసుకున్నారు. ఈ జాబితాలో ఇతను మూడవ స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాలో విప్రో సీఈవో రెండో స్థానంలో నిలిచారు. థియరీ డెలాపోర్టే వార్షిక ప్యాకేజీ FY2022లో రూ. 79.8 కోట్లు.
2022లో అత్యధిక జీతం పొందిన సీఈవో హెచ్‌సిఎల్ కంపెనీకి చెందిన సి. విజయకుమార్. 2021లో అతని జీతం రూ. 123.13 కోట్లు.