Auto Expo: ఆటో ఎక్స్‌పోలో టాటా వాహనాల క్యూ.. ఏకంగా 32 వాహనాల లాంచ్

ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2025ను మార్కెట్ నిపుణులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్ని కంపెనీలు సూపర్ ఫీచర్లతో కార్లు, బైక్‌లు, స్కూటర్లు, ఇతర వాహనాలను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. అయితే ఈ ఆటో ఎక్స్‌పో టాటా కంపెనీ పెద్ద ఎత్తున వాహనాలను లాంచ్ చేసింది. టాటా లాంచ్ చేసిన వాహనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Auto Expo: ఆటో ఎక్స్‌పోలో టాటా వాహనాల క్యూ.. ఏకంగా 32 వాహనాల లాంచ్
Auto Expo 2025

Updated on: Jan 18, 2025 | 4:30 PM

ఆటోమొబైల్ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పుల నేపథ్యంలో టాటా మోటార్స్ ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో 32 కొత్త ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టింది. దీంతో పాటుగా టాటా కంపెనీ అనేక స్మార్ట్ పరిష్కారాలను కూడా అందించింది. ఇవి గ్రీన్ ఎనర్జీ, జీరో-ఎమిషన్ మొబిలిటీకి పెద్ద అడుగుగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలపై టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ తాము ఆరు జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో మినీ ట్రక్కులు, పికప్‌లు, ఇంటర్మీడియట్, భారీ ట్రక్కులు, అలాగే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని తెలిపారు. ఈ వాహనాలన్నీ వాణిజ్య విభాగంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ తమ కంపెనీ అత్యంత శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీను లాంచ్ చేసినట్లు చెప్పారు. అలాగే తమ కంపెనీ ఆల్-న్యూ టాటా సియెర్రాను కూడా పరిచయం చేసింది . టాటా సియెర్రా మొదటిసారిగా 1991లో ప్రారంభించామని, భారతీయ మార్కెట్లో ఈ కారు ఒక ఐకానిక్ ఎస్‌యూవీగా ఉందని పేర్కొన్నారు.

టాటా సన్స్, టాటా మోటార్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఒక వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ వైపు వేగవంతమైన మార్పు ఇప్పుడు అనివార్యంగా మారిందని తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తుందని చెప్పారు. అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత, సౌలభ్యాన్ని స్మార్ట్, ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలతో అందిస్తున్నామని ఆయన చెప్పారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ 50 కంటే ఎక్కువ నెక్స్ట్ జెనరేషన్ వాహనాలతో ఇంటెలిజెంట్ సొల్యూషన్‌లను ప్రదర్శిస్తామని ఆయన తెలియజేశారు. 

టాటా మోటార్స్ తన కొత్త ఆఫర్ల ద్వారా ఎలక్ట్రిక్, జీరో-ఎమిషన్ వాహనాలపై సీరియస్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ మార్కెట్ స్థిరమైన మొబిలిటీ వైపు ఎక్కువగా కదులుతుందని ఈ దిశగా నిరంతరం కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. టాటా మోటార్స్‌కు సంబంధించిన ఈ కొత్త లాంచ్‌ల కారణంగా ఆటోమొబైల్ రంగంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. కమర్షియల్‌, ప్యాసింజర్‌ వాహనాల విభాగాల్లో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి