Car Sales: కేవలం రూ. 6.13 లక్షలకే టాటా టియాగో కారు.. ఆటోమేటిక్ ఫీచర్లతో లిమిటెడ్ ఆఫర్.!

|

Feb 25, 2023 | 12:36 PM

భారత మార్కెట్లో ఆటోమేటిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా కస్టమర్లు ఈ కార్లు..

Car Sales: కేవలం రూ. 6.13 లక్షలకే టాటా టియాగో కారు.. ఆటోమేటిక్ ఫీచర్లతో లిమిటెడ్ ఆఫర్.!
Tata Tiago
Follow us on

భారత మార్కెట్లో ఆటోమేటిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా కస్టమర్లు ఈ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా విలాసవంతమైన ఆటోమేటిక్ కారు కొనాలనుకుంటే, ఈ వార్త మీకోసమే. ప్రస్తుతం టాటా టియాగో ఆటోమేటిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 7.69 లక్షల వరకు ఉంటుంది. అయితే దాన్ని మీరు సెకండ్ హ్యాండ్‌లో కేవలం రూ. 6.13 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. Tata Tiago XZA ప్లస్ డ్యూయల్ టోన్ రూఫ్ AMT 2020 మోడల్ అమ్మకానికి అందుబాటులో ఉంది. సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ సైట్ స్పిన్నీ(Spinny) ఈ డీల్‌ను మీకు అందిస్తోంది. మరి అదేంటో తెలుసుకుందామా.?

2020 టాటా టియాగో XZA ప్లస్ మోడల్‌ కారు ఇప్పటివరకు 21,000 కిలోమీటర్లు నడిచింది. ఈ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పొందవచ్చు. ఈ టాటా కారు పెట్రోల్ వేరియంట్‌లో లభిస్తుండగా.. ఇది 2021లో రిజిస్టర్ చేయబడింది. అలాగే నోయిడా సెక్టార్-4లో ఈ కారు అందుబాటులో ఉంది. దీనిని ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.