Tata Steel: ఉద్యోగుల కోసం ‘టాటా స్టీల్‌’ సంచలన నిర్ణయం.. కరోనాతో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి జీతం

|

May 28, 2021 | 11:57 AM

Tata Steel: చిన్న నుంచి పెద్దల వరకు కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కోవిడ్‌తో ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఉద్యోగి.

Tata Steel: ఉద్యోగుల కోసం టాటా స్టీల్‌ సంచలన నిర్ణయం.. కరోనాతో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి జీతం
Tata Steel
Follow us on

Tata Steel: చిన్న నుంచి పెద్దల వరకు కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కోవిడ్‌తో ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఉద్యోగి మృతి చెందితే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు పెద్ద మనసు చాటుకుంటుంది. ఫస్ట్‌వేవ్‌లో 1500 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని టాటా స్టీల్‌ ప్రకటించింది. సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది.

ఈ మేరకు టాటా స్టీల్‌ తమ ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం కొనసాగించేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రకటించింది. ఒక వేళ మా ఉద్యోగి కరోనాతో మరణిస్తే, సదరు ఉద్యోగి కుటుంబానికి వేతనం అందిజేస్తామని టాటా తెలిపింది. ఉద్యోగి మరణించే నాటికి ఎంత వేతనం పొందుతున్నారో.. అంతే మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏళ్లు నిండే వరకు వారి ఫ్యామిలీకి అందిస్తామని తెలిపింది. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా కూడా చూస్తామని తెలిపింది.

ఒక వేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడి, సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం.. అని సోషల్‌ మీడియా టాటా వేదికగా వెల్లడించింది. తమ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణగా నిలుస్తామని తెలిపింది. ఈ కీలక నిర్ణయం తీసుకున్న టాటా స్టీల్‌ కంపెనీ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు.

 

ఇవీ కూాడా చదవండి

Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్‌ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు.. మరి ఎక్కువ స్టోరేజీ కావాలంటే..

Provident Fund: పీఎఫ్‌ డబ్బులతో లోన్‌ ఈఎంఐ కట్టుకోవచ్చా..? ప్రీమియంలు కూడా చెల్లించవచ్చా..? రూ.7 లక్షల బీమా