Reliance Vs Tata: రియలన్స్‌ బాటలో టాటా గ్రూపు.. ఏం చేయబోతుందంటే..

|

May 19, 2022 | 2:59 PM

ఫేస్‌బుక్‌ వరల్డ్‌ ఫేమస్‌ అందరికి తెలుసు అయితే వీళ్లు ఒక్క ఫేస్‌బుక్‌తోనే ఆగిపోలేదు. వాట్సాప్‌ను టేకోవర్ చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఈ రెండు సోషల్‌ మీడియాలో రారాజుగా ఉన్నాయి...

Reliance Vs Tata: రియలన్స్‌ బాటలో టాటా గ్రూపు.. ఏం చేయబోతుందంటే..
Tata
Follow us on

ఫేస్‌బుక్‌ వరల్డ్‌ ఫేమస్‌ అందరికి తెలుసు అయితే వీళ్లు ఒక్క ఫేస్‌బుక్‌తోనే ఆగిపోలేదు. వాట్సాప్‌ను టేకోవర్ చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఈ రెండు సోషల్‌ మీడియాలో రారాజుగా ఉన్నాయి. ఇలానే పెద్ద పెద్ద కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలను టేకోవర్ చేస్తున్నాయి. ప్రత్యేకించి- దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- ఇతర కంపెనీల్లో వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, వీలైతే వాటిని పూర్తిగా టేకోవర్ చేయడం చేస్తుంది. రిటైల్ బిజినెస్, ఫ్యాషన్, అప్పెరల్స్, టెలి కమ్యూనికేషన్స్, గ్రోసరీస్..వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది రిలయన్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) దాదాపు అన్ని రంగాల్లో అడుగు పెట్టింది.

లోకల్ సెర్చింజిన్‌ను జస్ట్ డయల్(Just Dail) కూడా సొంతం చేసుకుంది. రిలయన్స్‌ను ఎదుర్కొనేందుకు పోటీ కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా టేకోవర్లపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. రిటైల్ సెగ్మెంట్‌ను నెలకొన్న పోటీని ఎదుర్కొనడానికి టాప్ బ్రాండ్స్‌‌కు చెందిన కంపెనీలను కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఇప్పటికే చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ డిసౌజా ఈ విషయాన్ని వెల్లడించారు. టాప్ బ్రాండింగ్స్‌ను కొనుగోలు చేయడంపై ఇప్పటికే దృష్టి సారించామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..