
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ సేవను దేశవ్యాప్తంగా 122 స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌కు ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. దీనితో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తూ, ప్రీ-ఆర్డర్ విండోను 24 గంటల నుండి 96 గంటలకు (నాలుగు రోజులు) పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. అంటే మనకు ఫలానా స్టేషన్‌లో ఫుడ్ అవసరం అని నాలుగు రోజుల ముందుగానే ఆర్డర్ పెట్టొచ్చు. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఉపయోగపడనుంది.
స్విగ్గీ సేవలు ప్రారంభం కాబోయే కొత్త స్టేషన్లలో అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్), మధురై (తమిళనాడు), అల్వార్ (రాజస్థాన్), కోజికోడ్ (కేరళ), ఖుర్దా రోడ్ (ఒడిశా), యశ్వంత్‌పూర్ (కర్ణాటక), గోండా (ఉత్తరప్రదేశ్)లు ఉన్నాయి.
ఇటీవల ముగిసిన పండుగ సీజన్‌లో స్విగ్గీ తన ఫుడ్ ఆన్ ట్రైన్ నెట్‌వర్క్ ప్రయాణికులు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా సుపరిచితమైన పండుగ రుచులను ఆస్వాదించగలదని తెలిపింది. మా నెట్‌వర్క్ ఇప్పుడు 122 స్టేషన్లలో విస్తరించి ఉంది. అప్డేట్ చేసిన 4-రోజుల ప్రీ-బుకింగ్ విండోతో ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం, స్థానిక ఇష్టమైన వాటి నుండి భోజనాన్ని ఆస్వాదించడాన్ని మేం మరింత సులభతరం చేస్తున్నాం అంటూ స్విగ్గీ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి