Suzuki Access: సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..

|

Apr 24, 2024 | 3:36 PM

టాప్ బ్రాండ్ల నుంచి చిన్ని చిన్న స్టార్టప్ లు సైతం ఈవీల ఉత్పత్తికి సై అంటున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆటో మొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి. దీనిలో హీరో కంపెనీ ఇప్పటికే ముందంజలో ఉండగా.. హోండా కూడా యాక్టివాను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇప్పుడు సుజుకీ కూడా తన ప్రసిద్ధ ఉత్పత్తి అయిన యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Suzuki Access: సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
Suzuki Access
Follow us on

మన దేశంలో ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాల స్థానంలో విద్యుత్ శ్రేణి వాహనాలు వచ్చి చేరుతున్నాయి. మార్కెట్లో వేగంగా వాటి అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వేగంగా తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాయి. స్టైలిష్ లుక్ తో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో టాప్ బ్రాండ్ల నుంచి చిన్ని చిన్న స్టార్టప్ లు సైతం ఈవీల ఉత్పత్తికి సై అంటున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆటో మొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి. దీనిలో హీరో కంపెనీ ఇప్పటికే ముందంజలో ఉండగా.. హోండా కూడా యాక్టివాను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇప్పుడు సుజుకీ కూడా తన ప్రసిద్ధ ఉత్పత్తి అయిన యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మన దేశంలో అత్యంత విజయవంతమైన సుజుకీ యాక్సెస్ ను ఎలక్ట్రిక్ వెర్షన్లో అన్నీ కుదిరితే ఈ ఏడాదిలో లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జపనీస్ ఇంజినీర్లతో అభివృద్ధి..

జపనీస్ బ్రాండ్ సుజుకి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిని తయారు చేసినట్లు వివిధ సోర్సెస్ చెబుతున్నాయి. ఇది జపాన్‌లోని ఇంజినీర్‌లతో కలిసి అభివృద్ధి చేసినట్లు తెలుస్తోది. కంపెనీ గత రెండు సంవత్సరాలుగా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్‌ను పరీక్షిస్తున్నప్పటికీ, ఇది భారతదేశంలో మొదటిగా తన ఉనికిని చాటుకునే యాక్సెస్ అని చెబుతున్నారు.

సుజుకీ ఈ-యాక్సెస్..

ఈ కొత్త ఈవీని ఈ-యాక్సెస్ అని పిలిచే అవకాశం ఉంది. ఇ-బర్గ్‌మ్యాన్‌లో పేరు పెట్టే కన్వెన్షన్ కూడా కనిపిస్తుంది. డిజైన్ పరంగా, సుజుకి ఈ-బర్గ్‌మ్యాన్‌తో అదే విధానాన్ని తీసుకుంటుంది. మొత్తం స్టైలింగ్, బాడీ కాంపోనెంట్‌లు పెట్రోల్ ఇంజిన్ మోడల్‌ను పోలి ఉంటాయి. కానీ దాని పర్యావరణ అనుకూల స్వభావాన్ని ప్రదర్శించడానికి ‘బ్లూ’ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు..

ప్రస్తుతం, మోటార్ కెపాసిటీ, బ్యాటరీ, రైడింగ్ రేంజ్‌ వంటి వివరాలు ఏవి కంపెనీ నుంచి అందుబాటులో లేవు. అయితే ఇది 125సీసీ స్కూటర్ పనితీరును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫీచర్ల పరంగా, ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సుజుకి ఈ స్కూటర్‌కు ఎక్కువ ఫ్యాన్సీ ఫీచర్లను అందించకపోవచ్చని చెబుతున్నారు. హోండా, యమహా వంటి బ్రాండ్‌లను నిశితంగా పరిశీలించాలని యోచిస్తోంది. ప్రత్యర్థి ఉత్పత్తుల ఆధారంగా లాంచ్ తేదీపై కచ్చితమైన కాల్ తీసుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..