దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ప్రారంభమవగా… నిఫ్టీ కూడా అదే బాటలో ఆరంభమైంది. ఇక కొద్దిసేపట్లోనే దేశీయ సూచీలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సెన్సెక్స్ 50, 701వద్ద, నిఫ్టీ 14,928 వద్దకు చేరాయి. ఆ తర్వాత మళ్లీ కాస్తా కోలుకొని లాభాల బాట పట్టాయి. తిరిగి అంతేవేగంతో నేలను తాకాయి. ఇక సోమవారం ఉదయం 9.38 గంటలకు సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 50,860 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ ఆరు పాయింట్లు కోల్పోయి 14,975 వద్ద కొనసాగుతుంది. ఇక రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చుకుంటే రూ.72.60 వద్ద కొనసాగుతుంది. ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రయానిస్తున్నాయి. ఇటీవల లాభాల స్వీకరణను నమోదు చేసుకున్న దేశీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా కొనసాగుతున్నాయి. ఆటో, ఇన్ ఫ్రా, పీఎస్యూ రంగ షేర్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీలపై ప్రభావం చూపుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో లోహ, టెలీకాం, టెక్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నప్పటికీ.. కీలక కంపెనీలు మాత్రం దిగువకు పడిపోతున్నాయి. హిందాల్కో ఇండస్ట్రీన్, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా నష్టాల ధోరణిలో ఐటీసీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు ఉన్నాయి.
Also Read:
SBI: ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్ వచ్చేసింది.. వివరాలివే.!