
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఐఎంపీఎస్(IMPS) ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఛార్జీలు పెంచడం ద్వారా కస్టమర్లపై భారం మోపింది. ఇప్పటివరకు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల్లోపు ఐఎంపీఎస్ లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. ఆ లిమిట్ లోపు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండేవి కాదు. కానీ ఇక నుంచి రూ.25 వేల కంటే ఎక్కువ చేసే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.
-రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు చేసే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు రూ.2 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు
-ఇక రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు రూ.6 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు
-ఇక రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య చేసే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు రూ.10 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు.
బ్రాంచ్ ఛానెల్స్ ద్వారా చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు విధించే ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. వాటికి పాత రేట్లే అమల్లోకి ఉంటాయి. ప్రస్తుతం రూ.వెయ్యిలోపు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలు పూర్తిగా ఉచితం. రూ.వెయ్యి నుంచి రూ.లక్షల వరకు చేసే లావాదేవీలకు రూ.4 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తోండగా.. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చేసే ఐఎంపీఎస్ ట్రన్సాక్షన్లకు ఎస్బీఐ రూ.12 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇక రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేసే ట్రాన్సాక్షన్లకు రూ.20 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.