Business Ideas: కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించవచ్చు!

బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండి, పెట్టుబడి లేనివారికి డెకరేషన్ వ్యాపారం గొప్ప అవకాశం. క్రియేటివిటీ, AI యాప్‌లను ఉపయోగించి మోడరన్ డిజైన్‌లు రూపొందించి, అడ్వాన్స్ తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. పెళ్లిళ్లు, పార్టీలకు నిరంతరం డిమాండ్ ఉన్న ఈ రంగంలో, తక్కువ పెట్టుబడితోనే లక్షలు సంపాదించే అవకాశం ఉంది.

Business Ideas: కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించవచ్చు!
Loan India

Updated on: Nov 25, 2025 | 8:00 AM

బిజినెస్‌ చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఒక రోజు ఈ జాబ్‌ మానేసి మంచి బిజినెస్‌ పెట్టుకుండా అనే చెప్పేవాళ్లు మన చుట్టూ ఉంటారు. అంతెందుకు మనకు కూడా ఎప్పుడో ఒకసారి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ, పెట్టుబడి లేక కొందరు, ఏం వ్యాపారం చేయాలో అవగాహన లేక కొందరు ఆగిపోతుంటారు. అయినా వ్యాపారం చేయడానికి కొన్నిసార్లు డబ్బుతో పని ఉండదు. కాస్త క్రియేటివిటీ ఉన్నా.. కొన్ని బిజినెస్‌లు ప్రారంభించవచ్చు.

అలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అదేంటంటే డెకరేషన్‌ బిజినెస్‌. ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్‌ చేసినా, పెళ్లిళ్లు, పూజలు, బర్త్‌డేలు ఇతర పార్టీలు ఏవైనా కూడా డెకరేషన్‌ కచ్చితంగా ఉంటుంది. పైగా గతంలోలా ఏదో అల్లాటప్పగా కూడా ఉండటం లేదు. చాలా ప్రొఫెషనల్‌గా డెకరేషన్లు ఉంటున్నాయి. క్లాత్‌ డెకరేషన్‌, పచ్చిపూల డెకరేషన్‌ ఇలా అనేక రకాల డెకరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ డెకరేషన్‌ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ ఉంది.

ఇప్పుడు అదే డిమాండ్‌ను మీకున్న క్రియేటివిటీని వాడి మోడ్రన్‌గా మార్కెట్‌లోకి దిగండి. పైగా పైసా పెట్టుబడి లేకుండా ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు. అది ఎలాగంటే.. ముందుగా మీ ఫోన్లో ఏఐ, లేదా ఇతర ఎడిటింగ్‌ యాప్స్‌లో మంచి డెకరేషన్‌ డిజైన్‌ చేయండి. అలా కొన్ని డిజైన్స్‌ తీసుకెళ్లి.. మీకు తెలిసిన వారికో లేదా త్వరలోనే ఎవరింట్లో ఏదైనా శుభకార్యం ఉండి ఉంటే మీరే వెళ్లి వారిని కలిసి.. మీ డిజైన్స్‌ వారికి చూపించండి. వారికి నచ్చిన డిజైన్‌కు ఒక మంచి రేట్‌ చెప్పండి. అడ్వాన్స్‌గా కొంత అమౌంట్‌ తీసుకొని.. దాంతో ముందుగా డెకరేషన్‌ కోసం పూలు, క్లాత్‌లు తీసుకోండి. వర్కర్లను పెట్టుకొని ఫోన్లో కస్టమర్లకు చూపించిన డిజైన్‌ను చేసేయండి. శుభకార్యం అయిపోయిన తర్వాత మిగతా అమౌంట్‌ తీసుకొని వర్కర్లకు పేమెంట్‌ ఇచ్చేయండి. మిగిలింది మీ లాభం. అలా అలా మార్కెట్‌లో బెస్ట్‌ డెకరేషన్స్‌కు బ్రాండ్‌గా మారండి. పెళ్లిళ్ల సీజన్‌లో లక్షలు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి