Business Ideas: సీజన్‌తో సంబంధం లేని ట్రెండీ బిజినెస్‌..! మహిళలు మనసు పెడితే వేలకు వేలు సంపాదించుకోవచ్చు..!

ఈ ఫ్యాషన్ టైలరింగ్ వ్యాపారంతో సీజన్‌తో సంబంధం లేకుండా మంచి ఆదాయం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే బ్లౌజులు, సల్వార్‌లు, ఆల్టరేషన్స్ ద్వారా నెలకు రూ.40,000 నికర లాభం సంపాదించవచ్చు. సరైన ప్రణాళిక, మార్కెటింగ్‌తో మీరు మీకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకోవచ్చు.

Business Ideas: సీజన్‌తో సంబంధం లేని ట్రెండీ బిజినెస్‌..! మహిళలు మనసు పెడితే వేలకు వేలు సంపాదించుకోవచ్చు..!
Women With Indian Currency

Updated on: Nov 13, 2025 | 8:00 AM

మంచి వ్యాపారం మొదలు పెట్టాలని చూస్తుంటే.. ఈ ఐడియా గురించి తెలుసుకోండి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అదే ఫ్యాషన్‌ టైలరింగ్‌. బ్లౌజులు, సల్వార్ సూట్లు, లెహంగాలు కుడుతూ మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే రెడిమేడ్‌ దుస్తులకు ఆల్టరేషన్లతో కూడా డబ్బులు వస్తాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు టైలరింగ్‌ వచ్చి ఉండాలి, లేదా టైలర్లను నియమించుకొని కూడా పెద్ద ఎత్తున బిజినెస్‌ ప్రారంభించ వచ్చు. అలాగే 100 నుండి 150 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. మీరు ఇంట్లో కూడా దీన్ని ప్రారంభించవచ్చు.

అలాగే కుట్టు మిషన్లు, ఓవర్‌లాక్ యంత్రం, టేబుల్-కుర్చీ, కత్తెర, దారం, డిజైనింగ్ మెటీరియల్‌లు అవసరం. ప్రారంభంలో మొత్తం పెట్టుబడి దాదాపు రూ.35,000 నుండి రూ.60,000 వరకు ఉంటుంది. ఈ వ్యాపారంలో రోజువారీ ఆదాయం సగటున రూ.500 నుండి రూ.2,000 వరకు ఉంటుంది, అయితే నెలవారీ ఆదాయం రూ.15,000 నుండి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. విద్యుత్, సామాగ్రి, ఉద్యోగి ఉంటే వారి జీతంతో సహా పెట్టుబడి ఖర్చు దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఉంటుంది. నెలకు నికర లాభం సగటున రూ.10,000 నుండి రూ.40,000 వరకు ఉంటుంది.

మీరు డిజైనర్ బ్లౌజ్‌లు, పార్టీ వేర్ లేదా కస్టమ్ ఆర్డర్‌లపై దృష్టి పెడితే ఒక బ్లౌజ్‌ను రూ.800 నుండి రూ.2,000 వరకు అమ్మవచ్చు. ఆల్టరేషన్స్ వంటి ఇతర పనుల ద్వారా మీరు రూ.200 నుండి రూ.500 వరకు కూడా సంపాదించవచ్చు. మార్కెటింగ్ కోసం మీరు Instagram, Facebook, WhatsApp గ్రూపులను ఉపయోగించవచ్చు. మీ డిజైన్ల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా మీరు స్థానిక కస్టమర్లను చేరుకోవచ్చు. మీరు మార్కెట్లో మీకంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాత, నోటి మాట ద్వారా కస్టమర్లు పెరగడం ప్రారంభిస్తారు. దీనితో పాటు మీరు శిక్షణ తరగతులు తీసుకోవడం ద్వారా అదనపు డబ్బు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి